గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా మంటలు.. సిలిండర్లు పేలి ఇల్లు దగ్దం

by Ramesh Goud |

గ్యాస్ సిలిండర్ (gas cylinder) పేలి (explosion) ఇల్లు దగ్దం (house being burnt) అయిన ఘటన మేడ్చల్ జిల్లా (Medchal district) లోని శామీర్ పేట పోలీస్ స్టేషన్ (Shamirpet police station) పరిథిలో జరిగింది.

గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా మంటలు.. సిలిండర్లు పేలి ఇల్లు దగ్దం
X

దిశ, వెబ్ డెస్క్: గ్యాస్ సిలిండర్ (gas cylinder) పేలి (explosion) ఇల్లు దగ్దం (house being burnt) అయిన ఘటన మేడ్చల్ జిల్లా (Medchal district) లోని శామీర్ పేట పోలీస్ స్టేషన్ (Shamirpet police station) పరిథిలో జరిగింది. తూముకుంట మున్సిపాలిటీ (Thumukunta municipality) పరిధిలోని 15వ వార్డులో మహంకాళీ ఆలయం (Mahankali temple) వద్ద ఓ ఇంట్లో ఒక గ్యాస్ సిలిండర్ నుంచి మరో గ్యాస్ సిలిండర్ లోకి ఆ ఇంటి యజమాని గ్యాస్ రిఫిల్లింగ్ (Gas refilling) చేస్తున్నారు. ఈ సందర్భంలో అకస్మాత్తుగా (suddenly) మంటలు (fire) చెలరేగాయి.

దీంతో ఆ ఇంట్లోని వ్యక్తులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించగా.. లాభం లేకపోయింది. కొద్ది సేపటికే మంటలు ఇల్లు మొత్తం వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన ఇంట్లోని వ్యక్తులు బయటికి పరుగులు (ran outside) తీశారు. అనంతరం ఆ ఇంట్లో సిలిండర్లు పేలి, ఇల్లు (house) మొత్తం దగ్ధమైంది (burnt down). బాధిత కుటుంబం (victim family) ముందు జాగ్రత్తతో బయటకు పారిపోవడంతో ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం (no loss of life) జరగలేదు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు (police) సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది (Fire Workers) మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని (registered a case) దర్యాప్తు (investigate) చేపడతామని వెల్లడించారు.

Next Story