- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైకులో పెట్రోల్ కొట్టిస్తుండగా మంటలు..వీడియో వైరల్
సిద్దిపేట జిల్లాలోని ఓ పెట్రోల్ బంకులో పెను ప్రమాదం తప్పింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బైకులో పెట్రోల్ పోస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

దిశ, వెబ్ డెస్క్: సిద్దిపేట జిల్లాలోని ఓ పెట్రోల్ బంకులో పెను ప్రమాదం తప్పింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బైకులో పెట్రోల్ పోస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఆకస్మికంగా రావడంతో బైకు యజమాని వెంటనే అప్రమత్తమై కిందకు దిగాడు. బైక్ పెట్రోల్ ట్యాంకులోని మంటలను చేతిలో ఉన్న గుడ్డతో ఆర్పేశాడు. మరోవైపు పెట్రోల్ పంపుకు సైతం నిప్పు అంటుకోవడంతో పెట్రోల్ కొట్టే వ్యక్తి దానిని కిందపడేసి నీళ్లు చల్లారు. సిబ్బంది మంటలను ఆర్పేయడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీనికి సంబంధించిన వీడియో సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అవ్వగా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పెట్రోల్ పోసేటప్పుడు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వల్ల స్పార్క్ ఏర్పడి, పెట్రోల్ ఆవిర్లు మండటం లేదా గ్రౌండింగ్ సరిగా లేకపోవడం వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.






