- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాల్వంచ హీరో షోరూం లో అగ్నిప్రమాదం
పాల్వంచ పట్టణ నడిబొడ్డున సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అందరు ఇంకా నిద్ర మేల్కోకముందే ఈ సంఘటన జరిగింది

పాల్వంచ హీరో షోరూం లో అగ్నిప్రమాదం
- ఆహుతైన ద్విచక్ర వాహనాలు
- రూ. 20 లక్షలు ఆస్తి నష్టం
దిశ, పాల్వంచ టౌన్: పాల్వంచ పట్టణ నడిబొడ్డున సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అందరు ఇంకా నిద్ర మేల్కోకముందే ఈ సంఘటన జరిగింది... వెంటనే పట్టణం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మొత్తం దట్టమైన పొగలు వ్యాపించడం తో ఎం జరుగుతుందో కూడా తెలియని అయోమయం. పాల్వంచ అయ్యప్ప గుడి సమీపంలో రాజ్యలక్ష్మి మోటార్స్ హీరో షోరూం లో షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం సెలవు కావడంతో షోరూం తెరవలేదు. ఎం జరిగిందో ఏమో తెలియదు కానీ విద్యుదాఘాతంతో షోరూం పూర్తిగా మంటలు వ్యాపించాయి. స్థానికులు సమాచారం ఇవ్వడం తో నిర్వాహకులు అక్కడికి చేరుకొని వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజన్ వచ్చే సరికి పలు ద్విచక్ర వాహనాలు, సామాగ్రి దగ్ధం అయ్యాయి. ఫైర్ ఇంజిన్ సహాయంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసారు. ఈ ప్రమాదం లో సుమారు 20 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.






