- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: పాతబస్తీలో మరో అగ్నిప్రమాదం
by Ajay Maddhiboyina |
హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవలే పాతబస్తీలోని గుల్జార్ హౌస్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవలే పాతబస్తీలోని గుల్జార్ హౌస్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏకంగా 17 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం మర్చిపోకముందే తాజాగా పాతబస్తీలో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దూద్‌బౌలిలో ఈ ప్రమాదం జరిగింది. ఓ అపార్ట్‌మెంట్ భవనంలోని రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. మరోవైపు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని మధురానగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్రిప్రమాదం జరిగింది. ఏసీలకు సంబంధించిన కంప్రెషర్లు పేలిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలోనూ ఎలాంటి నష్టం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.
Next Story






