హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం

by Ajay Maddhiboyina |

హైదరాబాద్ KPHB బస్టాప్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పద్మావతి ప్లాజాలోని సాయి మొబైల్ షాపులో మంట‌లు చెల‌రేగాయి.

హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం
X

దిశ‌, వెబ్ డెస్క్: హైదరాబాద్ KPHB బస్టాప్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పద్మావతి ప్లాజాలోని సాయి మొబైల్ షాపులో మంట‌లు చెల‌రేగాయి. స‌మాచారం అందిన వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంది రంగంలోకి దిగి మంట‌ల‌ను అదుపుచేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు భావిస్తున్నారు. ప్ర‌మాదం కార‌ణంగా మొబైల్ షాపులోని విలువైన ఫోన్లు, సామాగ్రి దగ్ధం ద‌గ్దం అయిన‌ట్టు తెలుస్తోంది. ఇక ఇటీవ‌ల న‌గ‌రంలో అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌లు పెరిగిపోతున్న సంగ‌తి తెలిసిందే.

ఇక నిన్న సైతం అమీర్ పేట‌లోని మైత్రీవనంలో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. కోచింగ్ సెంట‌ర్ లో మంట‌లు చెల‌రేగ‌గా అందులో విద్యార్థులు సైతం ఉండిపోయారు. ఫైర్ సిబ్బంది స‌హాయంతో విద్యార్థులు ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డ్డారు. మ‌రోవైపు ఇటీవ‌ల ఫ‌ర్నిచ‌ర్ షాపులో అగ్నిప్రమాదం జ‌ర‌గ‌డంతో ఆస్తి, ప్రాణ న‌ష్టం వాటిల్లింది. ఇక ఎండాకాలం రావ‌డంతో ప్ర‌మాదాలు పెరిగిపోయే అవ‌కాశం ఉన్నందున ఫైర్ సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు ఆదేశించారు.

Next Story