BREAKING: మైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం.. ఇన్‌స్టిట్యూట్‌లో చిక్కుకున్న స్టూడెంట్స్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-20 06:18:33  IST  )

మైత్రీవనంలోని నీలగిరి బ్లాక్ నాల్గవ అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. ఓ కోచింగ్ సెంటర్లో మంటలు చెలరేగగా.. విద్యార్థులు లోపల చిక్కుకున్నట్లు సమాచారం.

BREAKING: మైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం.. ఇన్‌స్టిట్యూట్‌లో చిక్కుకున్న స్టూడెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న అమీర్ పేట్ సమీపంలోని మైత్రీవనం వద్ద అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం నీలగిరి బ్లాక్ భవనంలో నాల్గవ అంతస్తులో ఉన్న ఓ కోచింగ్ సెంటర్లో మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్పాట్ కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇన్ స్టిట్యూట్ లో చిక్కుకున్న విద్యార్థులను బాల్కనీ నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ స్టిట్యూట్ లో అగ్నిప్రమాదం జరగడంతో ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది. స్టూడెంట్స్, ఉద్యోగులు ఆ భవనం వద్దకు చేరుకుని సహాయకచర్యల్లో పాల్గొంటున్నారు. భవనం కింద అంతా వ్యాపార సముదాయాలు ఉండటం, బిల్డింగ్ అంతటా భారీ హోర్డింగ్స్ ఉండటంతో సహాయక చర్యలు కష్టతరంగా మారినట్లు తెలుస్తోంది. ఎవరైనా ప్రమాద వశాత్తూ కిందపడినా గాయాలు కాకుండా ఉండేందుకు సేఫ్టీ నెట్ ను పరిచారు. కోచింగ్ సెంటర్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల నుంచి విద్యార్థులను బయటకు తీసుకొచ్చే వీల్లేకపోవడంతో.. పెద్ద పెద్ద నిచ్చెనలతో బాల్కనీ నుంచి విద్యార్థులను కిందికి దించేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

Next Story