- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేతేపల్లి పోలీస్ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం
by Malleboina Mahesh |
కేతేపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సీజ్ చేసిన వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలను ఆర్పివేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: నల్లగొండ జిల్లా కేతేపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వివిధ కేసుల్లో భాగంగా పోలీసులు సీజ్ చేసి స్టేషన్ ప్రాంగణంలో భద్రపరిచిన పలు వాహనాలకు అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. ఎండ తీవ్రత, మరేదైనా కారణంతో చెలరేగిన ఈ మంటలు క్షణాల్లోనే పక్కనే ఉన్న ఇతర వాహనాలకు కూడా వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంపై వెంటనే స్పందించిన కేతేపల్లి పోలీస్ సిబ్బంది స్థానిక ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో ఘటనా స్థలానికి చేరుకుని, పోలీసులతో కలిసి యుద్ధప్రాతిపదికన మంటలను ఆర్పివేశారు. సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడం తో పోలీస్ స్టేషన్ ప్రధాన భవనానికి మరియు పెద్ద ఎత్తున జరగబోయే నష్టానికి బ్రేక్ పడింది. ప్రమాద కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






