కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక భరోసా.. డీజీపీ చేతుల మీదుగా రూ. కోటి బీమా చెక్కు అందజేత

by Ramesh Naini |

ప్రమాదవశాత్తు మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ రామానాయుడు కుటుంబానికి బీమా డబ్బులు డీజీపీ చేతుల మీదుగా బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రతినిధులు సోమవారం అందజేశారు.

కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక భరోసా.. డీజీపీ చేతుల మీదుగా రూ. కోటి బీమా చెక్కు అందజేత
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రమాదవశాత్తు మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ రామానాయుడు కుటుంబానికి బీమా డబ్బులు డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రతినిధులు సోమవారం అందజేశారు. బి. రామనాయుడు సోదరుడు బోయ బీచుపల్లికి డీజీపీ కార్యాలయంలో రూ. 1.05 కోట్ల చెక్కును అందజేశారు. రాష్ట్ర పోలీస్ శాఖతో కుదుర్చుకున్న ప్రత్యేక వేతన ప్యాకేజీ ఒప్పందం ప్రకారం, ప్రమాదవశాత్తు ఉద్యోగులు మరణిస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా వారికి బీమా సౌకర్యాన్ని కల్పిస్తుందని బ్యాంకు ప్రతినిధులు పేర్కొన్నారు. కానిస్టేబుల్ బి. రామనాయుడు గత సంవత్సరం రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా నార్కెట్‌పల్లి బ్రాంచ్‌లో బరోడా పోలీస్ జీతం ప్యాకేజీ జమ అవుతుందని, బీమా క్లెయిమ్ వెంటనే ప్రాసెస్ చేయబడిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఐజీ వెల్ఫేర్, డాక్టర్ గజరావు భూపాల్, బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ జోనల్ హెడ్ రితేష్ కుమార్, డీజీఎం, రీజినల్ హెడ్ రవి హెచ్‌జీ, డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ బ్రిగేడియర్ సనియాయ్ కుమార్ ప్రసాద్ హాజరయ్యారు.

Next Story