- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ చేతుల మీదుగా ఎంబీబీఎస్ విద్యార్థులకు ఆర్థిక సహాయం
by Ramesh Naini |
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థుల వైద్య విద్యకు అయ్యే ఫీజును చెక్కుల రూపంలో అందజేశారు. తాజాగా నంది నగర్‌లోని కేసీఆర్ నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 15 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ విద్యార్థులతో మాట్లాడి.. మంచిగా చదువుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కేసీఆర్‌కు, బండారి లక్ష్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






