- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Musi Revival Project : మూసీ నిర్వాసితులకు ఆర్థిక సాయం 37.50కోట్లు విడుదల
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు(Musi Revival Project) అమలులో భాగంగా మూసీ నిర్వాసితుల(Musi Displaced People)కు ఆర్థిక సాయం(Relief, Rehabilitationఅందించేందుకు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పోరేషన్(Musi River Development Corporation)కు నిధుల పురపాలక శాఖ రూ.37కోట్ల 50లక్షలు నిధులు(Rs. 37 crore 50 lakhs Released)విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు(Musi Revival Project) అమలులో భాగంగా మూసీ నిర్వాసితుల(Musi Displaced People)కు ఆర్థిక సాయం(Relief, Rehabilitationఅందించేందుకు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పోరేషన్(Musi River Development Corporation)కు నిధుల పురపాలక శాఖ రూ.37కోట్ల 50లక్షలు నిధులు(Rs. 37 crore 50 lakhs Released)విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ నుంచి ఇళ్లు ఖాళీ చేసి వెళ్తున్న వారికి ఖర్చుల కోసం రూ.25 వేలు ఇవ్వడం కొనసాగుతోంది. అలా 15 వేల కుటుంబాలకు రూ.25 వేల చొప్పున నగదు అందజేస్తోంది.
మూసీ నిర్వాసితులు ఇండ్లు ఖాళీ చేసే ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు పనులకు అవసరమైన భూసేకరణ, నిర్వాసితులకు రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటికే కొంతమంది ఇళ్లు ఖాళీ చేసిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించింది. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న 16వేల ఇళ్లను మూసీ నిర్వాసితులకు ఇచ్చేలా గతంలో జీవో జారీచేసినట్లు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్ వెల్లడించారు. '
కొన్నినెలలుగా 3 జిల్లాల పరిధిలోని మూసీ నదిపై సర్వే జరిగింది. రెవెన్యూ అధికారులు నదిగర్భంలో, బఫర్ జోన్ లో 10,200 నిర్మాణాలను గుర్తించారు. వాటిలో ఎవరెవరు ఉన్నారో గుర్తించేందుకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించామని దాన కిశోర్ తెలిపారు. బాధితులకు పునరావాసం ఎక్కడ కల్పిస్తున్నామనే వివరాలు కూడా ఇస్తామని.. మొదట నదీ గర్భంలో ఉన్న 1,600 నిర్మాణాల్లోని బాధితులకు ఇళ్ల కేటాయింపు జరుగుతుందన్నారు.
పునరావాసం కల్పించాక ఆక్రమణలను తొలగిస్తామని.. అర్హులైన ప్రతి ఒక్క బాధితుడికి చట్ట ప్రకారం నష్టపరిహారం, పునరావాసం అందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలను పక్కాగా అమలు చేస్తామని తెలిపారు. మూసీ నిర్వాసితుల కోసం తాజాగా విడుదలైన 37.50కోట్లతో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పనులు ఊపందుకోనున్నాయి.






