- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: గ్రామీణ సంస్థలకు కేంద్రం నిధులు విడుదల
తెలంగాణ గ్రామ పంచాయతీలకు మొదటి విడతగా రూ. 259.36 కోట్లు, ఆ తర్వాత రెండవ విడతగా రూ. 387.1 కోట్లు విడుదల అయ్యాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామీణ స్థానిక సంస్థలకు ఆర్థిక సంఘం కేటాయింపుల కింద 2026లో తెలంగాణకు ఇప్పటివరకు రూ.1,034.42 కోట్ల నిధులు అందజేశారని, ఈ నిధులతో రాష్ట్రంలోని 12,702 గ్రామ పంచాయతీలకు పెద్దఎత్తున ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గురువారం తెలంగాణ గ్రామ పంచాయతీలకు మొదటి విడతగా రూ. 259.36 కోట్లు, ఆ తర్వాత రెండవ విడతగా రూ. 387.1 కోట్లు విడుదల అయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కిషన్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులలో మూడవ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసిందని, దీని ద్వారా తెలంగాణకు రూ. 387.96 కోట్ల నిధులు విడుదలయ్యాయన్నారు.
మిగిలిన రూ. 2000 కోట్ల నిధులు కూడా..
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇటీవలే ఈ నిధులు విడుదల అయ్యాయని, ఈ నిధులకు సంబంధించిన ఖర్చులకు వినియోగ ధృవీకరణ పత్రాలు (యుటిలైజేషన్ సర్టిఫికెట్స్) కేంద్రానికి సమర్పించిన తర్వాత మిగిలిన రూ. 2000 కోట్ల నిధులు కూడా వెంటనే విడుదల అవుతాయని కిషన్ రెడ్డి చెప్పారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు మరియు స్థానిక సంస్థలకు రూ.11,000 కోట్లకు పైగా నిధులను విడుదల చేసిందని, 2015–16 నుండి 2019–20 వరకు రూ.5,060 కోట్లు విడుదల చేయగా, 2020–21 నుండి 2025–26 వరకు కేటాయింపులు 80 శాతం పెరిగి రూ.9,050 కోట్లకు చేరుకున్నాయని ఆయన తెలిపారు. అందులో రూ.6,051 కోట్ల నిధులు ఈ ఏడాది జనవరికి ముందే విడుదల అయ్యాయని కిషన్ రెడ్డి చెప్పారు.
నిధుల వినియోగం కోసం ప్రత్యేక బ్యాంకు..
తెలంగాణ ఆర్థిక శాఖ ఈ నిధులను పది పని దినాలలోపు ఆయా గ్రామ పంచాయతీలకు బదిలీ చేయాల, ఆ పని దినాలకు మించి ఏదైనా ఆలస్యం జరిగితే, రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర పథకాల కోసం తీసుకున్న మార్కెట్ రుణాలు/రాష్ట్ర అభివృద్ధి రుణాలపై చెల్లిస్తున్న వడ్డీ రేటు ప్రకారం, గ్రామ పంచాయతీలకు కూడా వడ్డీతో కలిపి కేంద్ర నిధులను విడుదల చేయాల్సి ఉంటుందని కిషన్ రెడ్డి చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీ నిధుల వినియోగం కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతాను నిర్వహించాలి, దీన్ని పీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఒక ప్రత్యేకమైన ఏజెన్సీ కోడ్‌తో నమోదు చేసి పారాదర్శకతతో నిధుల బదిలీ, ఖర్చు, యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ సమర్పించాల్సి ఉంటుందని కిషన్ రెడ్డి చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ బ్యాంకు ఖాతాలను అటాచ్ చేసి, కేంద్రం విడుదల చేసిన నిధులను ఇతర కార్యక్రమాల కోసం మళ్లించి గ్రామాలకు అన్యాయం చేసిందని, దీనితో అనేక మంది సర్పంచ్‌లు తమ పదవీకాలంలో అమలు చేసిన పనులకు నిధులు అందకపోవడంతో రాజీనామా చేశారు. కొన్ని చోట్ల, సర్పంచ్‌లు ఆత్మహత్యలకు కూడా పాల్పడిన విషయం తెలంగాణ ప్రజలకు తెలిసిందే అని కిషన్ రెడ్డి తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ సంస్థలు/గ్రామీణ స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.5,060 కోట్లు విడుదల చేసిందని కిషన్ రెడ్డి చెప్పారు. 15వ ఆర్థిక సంఘం తెలంగాణకు రూ.9,050 కోట్లు నిధులను కేటాయించిందన్నారు. రెండు ఆర్థిక సంఘాల కింద కలిపి రూ.14,110 కోట్లను తెలంగాణకు కేటాయించిందని ఆయన చెప్పారు. 14 వ ఆర్ధిక సంఘం లో రూ.5,060 కోట్లు, 15వ ఆర్ధిక సంఘం లో రూ. 6,051 కోట్లతో కలిపి రూ.11,111 కోట్లు డిసెంబర్ 31, 2025 నాటికి విడుదల అయ్యాయన్నారు.






