- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
50 ఏళ్లుగా లేని కండిషన్లు ఇప్పుడే ఎందుకు? ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు
ఫిల్మ్ ఫెడరేషన్ వేతనాల నిరసన 13 రోజులకు చేరుకుందని, కానీ నిర్మాతలు సంప్రదింపుల పేరుతో కాలయాపన చేస్తున్నారని తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ మండిపడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఫిల్మ్ ఫెడరేషన్ వేతనాల నిరసన 13 రోజులకు చేరుకుందని, కానీ (Producers) నిర్మాతలు సంప్రదింపుల పేరుతో కాలయాపన చేస్తున్నారని తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ (Film Federation President Anil) మండిపడ్డారు. ఈ మేరకు ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. మేము చర్చలకు ఒప్పుకోవట్లేదని నిర్మాతలు బయట మాట్లాడుతున్నారని ఆరోపించారు. మమ్మల్ని మీడియా ముందు మాట్లాడవద్దు అని నిర్మాతలు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారని అన్నారు. మేము మాత్రం మూడు రోజుల నుంచి కూడా మీడియా ముందుకు రావడం లేదని, సైలెంట్‌గా ఉన్నామని తెలిపారు. 50 ఏళ్ల నుంచి లేని కండిషన్లు నిర్మాతలు ఇప్పుడు పెడుతున్నారని, వేతనాల పెంపు టాపిక్‌ను వాళ్లు డైవర్షన్ చేసుకుంటూ కాలయాపన చేస్తున్నారని అన్నారు.
నిర్మాతలు కూడా కష్టాల్లో ఉన్నారు కాబట్టి మేము కూడా కొంత దిగి వస్తామని స్పష్టం చేశారు. మేము చర్చలకు సిద్ధంగానే ఉన్నాము.. కానీ నిర్మాతలు ఎవరు అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు. కరెక్ట్‌గా వేతనాల సమస్య వచ్చే సరికి ఎక్కడెక్కడ లేని పాయింట్స్ మాట్లాడుతున్నారని అన్నారు. మా కష్టానికి ప్రతిఫలాన్ని అడుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతం గురించి మీరు మాట్లాడితే మేము కూడా మాట్లాడాల్సి వస్తుందని, వారి నిర్ణయం చెప్తే.. మా కార్యాచరణ మేము ప్రకటిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.






