Film Director : హైదరాబాద్ లో సినీ దర్శకుడి అదృశ్యం

by Y. Venkata Narasimha Reddy |

హైదరాబాద్(Hyderabad)లో సినీ దర్శకుడు(Film Director) అదృశ్యమై(Missing)న ఘటన సంచలనంగా మారింది. నగరంలోని మియాపూర్ ఫ్రెండ్స్ కాలనీలో నివాసం ఉంటున్న తెలుగు సినిమా డైరెక్టర్ ఓం రమేష్ కృష్ణ (46) కనిపించకుండా పోయారు.

Film Director : హైదరాబాద్ లో సినీ దర్శకుడి అదృశ్యం
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad)లో సినీ దర్శకుడు(Film Director) అదృశ్యమై(Missing)న ఘటన సంచలనంగా మారింది. నగరంలోని మియాపూర్ ఫ్రెండ్స్ కాలనీలో నివాసం ఉంటున్న తెలుగు సినిమా డైరెక్టర్ ఓం రమేష్ కృష్ణ (46) కనిపించకుండా పోయారు. ఓం రమేష్ కృష్ణ ఈనెల 4వ తేదీన బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యుల కథనం. ఓం రమేష్ కృష్ణ ఆచూకీ కోసం తీవ్రంగా వెతికిన కుటుంబ సభ్యులు, భార్య శ్రీదేవి చివరకు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఓం రమేష్ కృష్ణ ఇన్ని రోజులుగా కనిపించకుండా పోవడం మిస్టరీగా మారింది. అసలు అతను బతికే ఉన్నాడా..ఉంటే భార్యకు కూడా సమాచారం ఇవ్వకుండా ఇన్ని రోజుల పాటు ఏమయ్యాడన్నది చర్చనీయాంశమైంది. పోలీసులు అతని సన్నిహితులను, సినీ పరిశ్రమలో అతనితో కలిసి పనిచేసిన వారిని విచారిస్తూ కేసు దర్యాప్తులో ముందుకెలుతున్నారు.

Next Story