- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KomatiReddy VenkataReddy : ఆస్తుల కోసమే గొడవ : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
కేసీఆర్(KCR) కుటుంబంలో ఆస్తుల కోసమే కేటీఆర్(KTR), కవిత(Kavitha), హరీష్ రావు(Harish Rao) మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(KomatiReddy VenkataReddy) పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : కేసీఆర్(KCR) కుటుంబంలో ఆస్తుల కోసమే కేటీఆర్(KTR), కవిత(Kavitha), హరీష్ రావు(Harish Rao) మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(KomatiReddy VenkataReddy) పేర్కొన్నారు. కానీ వారు విడిపోకుండా ఉండటానికే ఇంత డ్రామా చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్(BRS)లో కవిత లేఖ(Kavitha Letter), హరీష్ రావు వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత సంక్షోభాన్ని సూచిస్తున్నాయని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారని, రీజినల్ రింగ్ రోడ్ లాంటి ప్రాజెక్టులు ఆగిపోయాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోగా.. ప్రజలు ఆ పార్టీని మరచిపోయారని విమర్శించారు.
జూన్ 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) యాదాద్రి జిల్లాలో పర్యటిస్తారని.. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని వివరించారు. గత పాలకుల వలన రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు, మహాలక్ష్మి లాంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వడంలో అడ్డుపడుతున్నారని ఆరోపించారు.






