- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Fight hard uncle: ఫైట్ హార్డ్ అంకుల్! కేటీఆర్‌కు మద్దతుగా చిత్రాన్ని గీసిన బాలుడు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కి మద్దతుగా ఫైట్ హార్డ్ అంకుల్ అంటూ కేటీఆర్ చిత్రాన్ని 5వ తరగతి చదువుతున్న మాణిక్య శ్రీయాన్ రాజ్ గీశాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కి మద్దతుగా ఫైట్ హార్డ్ అంకుల్ (Fight hard uncle) అంటూ కేటీఆర్ చిత్రాన్ని 5వ తరగతి చదువుతున్న మాణిక్య శ్రీయాన్ రాజ్ గీశాడు. ఫార్ములా ఈ రేసు సందర్భంగా మహీంద్రా టీమ్‌కి మద్దతుగా వెళ్లిన శ్రీయాన్.. ఇలా కేటీఆర్‌పైన అక్రమ కేసులు పెడితే భవిష్యత్తులో హైదరాబాద్‌కి ఇంకా రేసులు రానే రావని శ్రీయాన్ అన్నాడు. బాలుడు గీసిన చిత్రాన్ని మాజీ మంత్రి కేటీఆర్ టీమ్ తాజాగా ఎక్స్ వేదికగా పంచుకుంది. కాగా, శ్రీయాన్ గీసిన చిత్రంపై కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
కాగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Formula E Race Case) ఫార్ములా ఈ-రేసులో అవినీతి జరిగిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఫార్ములా ఈ-రేసు కేసు వ్యవహారంలో ఇటీవల కేటీఆర్ ఏసీబీ విచారణకు కూడా హాజరయ్యారు. ఇంకా వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటామని కేటీఆర్ ఇటీవల మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఫార్మూలా ఈ రేస్ జరిపినట్లు చెప్పుకొచ్చారు.






