DT రాజేష్ ఖ‌న్నా కోసం త‌ర‌లివ‌చ్చిన‌ రెవెన్యూ ‘బ‌ల‌గం’

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-24 16:32:56  IST  )

ఇంటికి పెద్ద దిక్కు అనారోగ్యంతో ఆస్ప‌త్రి పాల‌య్యాడు. అప్పు స‌ప్పు చేసినా ఆస్పత్రి బిల్లులు చెల్లించ‌లేని దుస్థితి.

DT రాజేష్ ఖ‌న్నా కోసం త‌ర‌లివ‌చ్చిన‌ రెవెన్యూ ‘బ‌ల‌గం’
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటికి పెద్ద దిక్కు అనారోగ్యంతో ఆస్ప‌త్రి పాల‌య్యాడు. అప్పు స‌ప్పు చేసినా ఆస్పత్రి బిల్లులు చెల్లించ‌లేని దుస్థితి. చివ‌ర‌కు మంగ‌ళ సూత్రాల‌నైనా అమ్మి ఆస్ప‌త్రి బిల్లులు చెల్లించాల‌నుకుంది ఆ ఇంటి ఆవిడ‌. దిక్కుతోచ‌ని స్థితిలో కష్టాల కడలిలో ఉన్న ఆ కుటుంబానికి రెవెన్యూ బ‌ల‌గం తోడై నిలిచింది. ఇదంతా ఎవ‌రిదో కాదు.. ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి రెవెన్యూ ఉద్యోగి గాధ‌. వ‌రంగ‌ల్ జిల్లా న‌ల్ల‌బెల్లి డిప్యూటీ త‌హ‌శీల్దార్ రాజేష్‌ ఖ‌న్నా కుటుంబ ధీన ప‌రిస్థితి. విష‌యం తెలుసుకున్న తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మ‌న్‌, డిప్యూటీ క‌లెక్ట‌ర్ల సంఘం అధ్య‌క్షులు వి.ల‌చ్చిరెడ్డి ఆ కుటుంబానికి కొండంత అండ‌గా నిలిచారు. డిప్యూటీ క‌లెక్ట‌ర్ల సంఘం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.రామ‌కృష్ణ‌, త‌హ‌శీల్దార్స్ అసోసియేష‌న్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌మేష్ పాక, తెలంగాణ రెవెన్యూ స‌ర్వీసెస్ అసోసియేష‌న్ రాష్ట్ర అధ్య‌క్ష‌ కార్య‌ద‌ర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షంతో ఆస్ప‌త్రికి వెళ్లి రాజేష్ ఖ‌న్నాను ప‌రామ‌ర్శించారు.

అత‌డి కుటుంబానికి ధైర్యం చెప్ప‌డంతో పాటు మేమున్నామంటూ భ‌రోసా ఇచ్చారు. బంజారాహిల్స్‌లోని విరంచి ఆస్ప‌త్రి నిర్వాహ‌కుల‌తో మాట్లాడి బిల్లుల భారం కూడా లేకుండా చేశారు. రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయ‌కులుగా బాధ్య‌త‌తో పాటు మాన‌వ‌త్వాన్ని కూడా చాటుకున్నారు. మెరుగైన వైద్యం అందించ‌డంతో పాటు బిల్లుల భారం లేకుండా చేసిన ఆస్ప‌త్రి య‌జ‌మాన్యానికి ఈ సంద‌ర్భంగా ఉద్యోగ సంఘాల నాయ‌కులు ప్ర‌త్యేక‌ ధ‌న్య‌వాదాలు తెలిపారు. రాజేష్ ఖన్నా కుటుంబ సభ్యులు ఉద్యోగుల‌ జేఏసీ ఛైర్మ‌న్ వి.ల‌చ్చిరెడ్డికి, రెవెన్యూ సంఘాల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story