తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా ఫిబ్రవరి 4th

by Gantepaka Srikanth |

ఫిబ్రవరి 4వ (February 4th) తేదీకి ఎంతో ప్రత్యేకత ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు.

తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా ఫిబ్రవరి 4th
X

దిశ, వెబ్‌డెస్క్: ఫిబ్రవరి 4వ (February 4th) తేదీకి ఎంతో ప్రత్యేకత ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. 2024 ఫిబ్రవరి 4న కులగణన(Caste Census)పై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసుకున్నామని.. 2025 ఫిబ్రవరి 4న నివేదికను అసెంబ్లీలో ఆమోదించుకున్నామని చెప్పారు. అందుకే ఇక నుంచి ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన తెలంగాణ సోషల్ జస్టిస్ డే(Telangana Social Justice Day)గా జరుపుకుందామని పిలుపునిచ్చారు. అంతకుముందు సామాజిక, ఆర్థిక కులగణన సర్వేకు తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) ఆమోదం తెలిపింది.

దేశ వ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసింది. రేవంత్ తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ కులగణనపై తీర్మానం సందర్భంగా అసెంబ్లీలో బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ధీటుగా కౌంటర్ ఇచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. కులగణన లెక్కలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కులగణన సర్వేలో పాల్గొనలేని కేటీఆర్‌కు మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. రాజకీయం కోసం లేని పోని విమర్శలతో ప్రజలను గందరగోళంలోకి నెట్టొద్దని హితవు పలికారు.

Next Story