తండ్రి సర్పంచ్.. కొడుకు బిక్షాటన

by Muthe.Rajitha |

ఆ గ్రామంలో తండ్రి సర్పంచ్ గా గెలిచాడు. అయినప్పటికీ కొడుకు మాత్రం బిక్షాటన చేస్తున్నాడు.

తండ్రి సర్పంచ్.. కొడుకు బిక్షాటన
X

దిశ, వెబ్ డెస్క్ : ఆ గ్రామంలో తండ్రి సర్పంచ్ గా గెలిచాడు. అయినప్పటికీ కొడుకు మాత్రం బిక్షాటన చేస్తున్నాడు. ఎందుకూ అనుకుంటున్నారా.. ఆ వివరాలేంటో చూద్దాం. మెదక్ జిల్లా ఝాన్సీ లింగాపూర్ సర్పంచ్ గా మానేగల రామకృష్ణయ్య నిలబడ్డాడు. అయితే పోటీగా ఆయన పెద్ద కుమారుడే బరిలో నిలబడ్డాడు. కాగా తండ్రి గెలుపుకోసం చిన్నకుమారుడు భాస్కర్ చాలా కష్టపడ్డాడు. తన తండ్రి ఎన్నికల్లో గెలిస్తే బిక్షాటన చేస్తానని మొక్కుకున్నాడు. ఎన్నికల్లో తండ్రి గెలవడంతో భాస్కర్ ఇంటింటికీ తిరిగి బిక్షాటన చేసి మొక్కు తీర్చుకున్నాడు. అయితే ఈ ఘటనపై గ్రామంలో వారంతా ముక్కున వేలేసుకున్నారు. తండ్రి మీద గల ప్రేమకు భాస్కర్ ను అభినందించారు.

Next Story