- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో హృదయవిదారక ఘటన.. కొడుకు శవాన్ని తోపుడుబండిపై తీసుకెళ్లిన తండ్రి
రాష్ట్రంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం పరిధిలోని కేశవపట్నం గ్రామంలో సరైన సదుపాయాలు లేక తండ్రి తన కుమారుడి మృతదేహాన్ని తోపుడుబండిపై తీసుకువెళ్లాడు.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం పరిధిలోని కేశవపట్నం గ్రామంలో సరైన సదుపాయాలు లేక తండ్రి తన కుమారుడి మృతదేహాన్ని తోపుడుబండిపై తీసుకువెళ్లాడు. కుమారుడు కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా తండ్రి వీరయ్య అతడిని చెప్పుల దుకాణం వద్దకు తీసుకువెళ్లి, చెప్పులు కుట్టించి తరవాత ఆస్పత్రికి తీసుకువెళ్లాలని అనుకున్నాడు. కానీ ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలోనే యువకుడు మరణించాడు.
అనంతరం మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు గ్రామపంచాయితీకి సమాచారం ఇవ్వగా ఎలాంటి స్పందన రాలేదు. దాంతో తీవ్రనిరాశ చెంది తోపుడు బండిపై తల్లి, తండ్రి కలిసి మృతదేహాన్ని ఇంటికి తీసుకునివెళ్లారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అధికార యంత్రాంగం తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎక్కడో పల్లెటూరులో, ఎలాంటి వసతులు లేని మారుమూల గ్రామాల్లో ఇలాంటి ఘటన జరిగిందనుకుంటే ఏమో అనుకోవచ్చు కానీ కరీంనగర్ వరంగల్ హైవేపై ఇలాంటి ఘటన చోటు చేసుకోవడమేంటని ఆశ్చర్యపోతున్నారు.






