- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పండుగపూట ఘోర ప్రమాదం.. తండ్రి, కూతురు మృతి
పండుగపూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు దుర్మరణం చెందారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: పండుగపూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు దుర్మరణం చెందారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. బతుకమ్మ, దసరా పండుగ కోసం తండ్రి వెంకన్న.. కూతురు అనూష, అల్లుడిని ఇంటికి తీసుకెళ్లడానికి మహబూబాబాద్ వచ్చాడు. అనంతరం వారిని తీసుకొని బైకుపై ఇంటికి వెళ్తుండగా మడూర్ దగ్గర అతివేగంగా వచ్చిన ఓ కార్డు వారి బైకును బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తండ్రి వెంకన్న, కూతురు అనూష అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అల్లుడి పరిస్థితి విషమంగా మారింది. గమనించిన స్థానికులు వారిని హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






