ఓఆర్ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం : ఒకరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

by Ramesh Naini |

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌పై నార్సింగి టీఎస్‌పీఏ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది.

ఓఆర్ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం : ఒకరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌పై (ORR) నార్సింగి టీఎస్‌పీఏ (TSPA) సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి గచ్చిబౌలి వైపు వేగంగా వెళ్తున్న ఓ కారు.. అదుపుతప్పి ముందు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన నార్సింగి పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story