- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NPDCL: రైతులెవరూ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు: ఎన్‍పీడీసీఎల్ సీఎండీ
రైతులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సేవలు అందిస్తున్నామని ఎస్‍పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకైన రైతులకు (farmers) మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సేవలు అందిస్తున్నామని ఎస్‍పీడీసీఎల్ (TGNPDCL) సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి (CMD Karnati Varun Reddy) అన్నారు. వ్యవసాయ సర్వీసుల మంజూరు యుద్ధ ప్రాతిపదికన రిలీజ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల జారీలో మరింత పారదర్శకత తీసుకువచ్చామని, కొత్త కనెక్షన్ కొరకు నమోదు చేసుకున్నప్పటి నుంచి సర్వీస్ రిలీజ్ అయ్యే వరకూ ప్రతి దశలోనూ మొబైల్ నంబర్‍కు అప్డేట్ మెసేజ్‍లు తెలుగులో పంపిస్తున్నామన్నారు. ఈమెసేజ్‍లో లింక్ కూడా పంపిస్తుండడంతో దానిని ఓపెన్ చేస్తే స్టేటస్ రిపోర్ట్ మొత్తం తెలిసేలా ఏర్పాట్లు చేశామన్నారు. మెటీరియల్ త్వరితగతిన రిలేజ్ అయ్యేలా ఈ - స్టోర్ విధానాన్ని తీసుకువచ్చామన్నారు. తగిన చర్యలు తీసుకోవడం వల్లనే ఎక్కడ మెటీరియల్ కొరత లేదన్నారు. రైతు లెవరూ ఎటువంటి మెటీరియల్ కొనరాదని, ఎవరు కూడా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎటువంటి ఇబ్బందులు ఏర్పడిన 1912 కి ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు.
పొలంబాట ప్రోగ్రామ్:
రైతులకు మరింత చేరువై వారి సమస్యలను పరిష్కరించే దిశగా విద్యుత్ అధికారుల "పొలం బాట" కార్యక్రమాన్నిచేపట్టామని సీఎండీ చెప్పారు. నేరుగా రైతుల వద్దకు వెళ్లి వారికి ఉన్న విద్యుత్ సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తున్నామని ఇప్పటివరకు ఇలా పొలం బాట కార్యక్రమాలు 4,064 చేపట్టామన్నారు. రైతులకు ట్రాన్స్ ఫార్మర్ల తరలింపులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండ కొత్తగా వాహనాలను ఏర్పాటు చేశామని, ఎక్కడ ట్రాన్స్ ఫార్మర్ల చెడిపోయింది అని తెలియగానే వెంటనే డిపార్ట్మెంట్ వాహనం వెళ్లి కొత్త ట్రాన్ఫర్మర్‍ను అక్కడ అమర్చుతారని తెలిపారు. రైతులకు ఇబ్బందులు లేకుండా నిబద్దతతో పని చేస్తున్నామన్నారు. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు పెంచడానికి కొత్తగా ఎస్పీఎం షెడ్‍లు ఏర్పాటు చేశామని తద్వారా త్వరితగతిన ట్రాన్స్ ఫార్మర్ల మరమత్తులు అవుతాయన్నారు.
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‍కు సంబంధించి ఎస్టిమేట్ మంజూరు, ఒక వేళ ORC చెల్లించేది ఉంటె వాటి మొత్తం వివరాలు, డిమాండ్ నోటీస్, స్కెచ్, మంజూరైన మెటీరియల్స్ తదితర వివరాలు మెసేజ్ రూపంలో రైతులకు వస్తుందన్నారు. ప్రతి దశలో మెసేజ్‍లు, టీజీఎన్పీడీసీఎల్ కు చెందిన వెబ్ లింక్ కూడా పంపిస్తుండడంతో రైతులకు ఇబ్బందులు ఉండవని చెప్పారరు. ప్రతి వారం, నెలల వారీగా ప్రత్యేకంగా వ్యవసాయ సర్వీసుల మంజూరుపై కమర్షియల్ విభాగం, 16 సర్కిళ్ల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. విద్యుత్ ప్రమాదాలను నివారించడానికి వంగిన పోల్‍లను, లూజ్ లైన్‍లను సరిచేస్తున్నామని మధ్య స్తంభాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తీగల మధ్య అవసరం ఉన్న చోట స్పేసర్స్ పెడుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు లూజ్ లైన్లు 4,419, వంగిన పోల్‍లు 1,757, మధ్య స్తంభాలు 3,140 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓవర్ లోడ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్ల సామర్ధ్యాన్ని పెంచామన్నారు.






