- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతు ఫస్ట్.. భట్టి బడ్జెట్‌లో అన్నదాతలకు అగ్రపీఠం.. రూ. 23,179 కోట్లు కేటాయింపులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్నదాతలకు అగ్ర తాంబూలం అందించింది. రైతు సంక్షేమం, వ్యవసాయ రంగానికి రూ.23,179 కోట్లు కేటాయింపులు చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో : డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్నదాతలకు అగ్ర తాంబూలం అందించింది. రైతు సంక్షేమం, వ్యవసాయ రంగానికి రూ.23,179 కోట్లు కేటాయింపులు చేసింది. రైతు భరోసాకు రూ. 18 వేల కోట్లు కాగా, వ్యవసాయ ఉత్పత్తులకు బోనస్రూ. 3500 కోట్లు కేటాయించింది. గడిచిన బడ్జెట్లో రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు ఇవ్వడంతో వ్యవసాయ దిగుబడుల్లో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. కొత్త బడ్జెట్లోకి వ్యవసాయానికి ప్రాముఖ్యత ఇవ్వడంతో ఈ ఏడాదిలో కూడా పెట్టుబడి సహాయం కోసం రైతు భరోసా పథకం ద్వారా ప్రతి సీజన్ కు ఎకరాకు రూ. 6 వేల చొప్పున రెండు పంటలకు కలిపి సంవత్సరానికి రూ. 12 వేల సహాయం అందించనుంది. రైతులకు మద్దతు ధరను ఇవ్వడం కోసం వారికి ప్రోత్సాహకంగా సన్నవడ్లకు క్వింటాకు రూ. 500 చొప్పున అందజేస్తూ, ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుంది. దీని ద్వారా, ప్రతి ఎకరానికి రైతుకు సగటున దాదాపు 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని పరిగణిస్తే, ఒక్క సీజన్‌కు ఎకరానికి రైతుకు సుమారు రూ.12, 500 ఆదాయం లభిస్తోంది. దీంతో రైతుకు సంవత్సరానికి రెండు పంటలకు కలిపి రూ. 25 వేల అధిక ఆదాయం పొందుతారు. రాష్ట్రంలో ఉద్యాన పంటల విస్తీర్ణం సుమారు 13 లక్షల ఎకరాలుగా ఉంది. మామిడి, సీతాఫలం, మిరప, పసుపు, నారింజ వంటి పంటల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.79, 287 మంది రైతులు 2,90, 466 ఎకరాలలో ఆయిల్ పామ్పంటను సాగు చేస్తున్నారు. ఈ పంటను మరో 68 వేల ఎకరాల్లో విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించారు. మైక్రో ఇరిగేషన్ పద్ధతులను 2. 34 వేల ఎకరాల్లో అమలు చేయాలని నిర్ణయించారు.
ఇందిర సౌర గిరి జల వికాసం..
అదే విధంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న షెడ్యూల్డ్ తెగల వారికి రూ. 12, 600 కోట్లతో ఇందిర సౌర గిరి జల వికాసం పథకం ద్వారా 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపు సెట్లను అందించనుంది. 6 లక్షల ఎకరాల పోడు భూములలో అటవీ ఉత్పత్తులకు సంబంధించిన తోటల పెంపకాన్ని ప్రోత్సహించి 2.10 లక్షల గిరిజన రైతులకు ఈ సౌకర్యం అందించనుంది. ఈ పథకాన్ని ఇప్పటికే అచ్చంపేటలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభింగా దీని విధి విధానాలు అధ్యయనం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్లాన్చేస్తోంది.
ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ. 7366 కోట్లు..
పేదలకు సన్నబియ్యం పంపిణీ, రైతులు సన్న ధాన్యం పండించేందుకు బోనస్ఇవ్వడం కోసం రూ. 7366 కోట్లు ప్రతిపాదనలు చేసింది. ఎల్పీజీ సిలిండర్ల రాయితీ కోసం రూ. 723 కోట్లు, రైస్ సబ్సిడీ కి రూ. 3 వేల కోట్లు ప్రతిపాదనలు చేసింది. కాంగ్రెస్ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హులైన పేద కుటుంబాలకు 15.12 లక్షల కొత్త రేషన్‌కార్డులు జారీ చేశారు. అదే విధంగా పాత కార్డుల్లో 19.44 లక్షల మంది కొత్త సభ్యులను చేర్చారు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం 1.05 కోట్లకు రేషన్ కార్డుల సంఖ్య చేరింది. గడిచిన ఏడాదిలో 284.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 1.27 కోట్ల ఎకరాల్లో పండింది. ఫిలిప్పైన్స్ కు 22, 750 మెట్రిక్ టన్నుల బియ్యం తెలంగాణ నుంచి ఎగుమతి చేయడం జరిగింది. దీని ద్వారా మన బియ్యానికి డిమాండ్ పెరిగి, రైతాంగానికి మరింతగా మద్దతు ధర లభించింది. రాష్ట్రంలోని 3 కోట్ల 38 లక్షల లబ్ధిదారులకు పీడీఎస్పథకం కింద అన్ని రేషన్ షాపుల ద్వారా 6 కిలోల సన్నబియ్యం అందించబడుతోంది. దీని ద్వారా ఆహార భద్రత కల్పించడంతో పాటు ప్రజలకు నాణ్యమైన పోషకాహారాన్ని ప్రభుత్వం అందించనుంది.
పశు సంవర్థక, మత్స్య రంగాలకు రూ. 1529 కోట్లు..
ప్రభుత్వం పశువుల, చేపల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. రెండు ఉత్పత్తిలో చేయడంతో ఇతర దేశాలతో పోటీ పడేందుకు తగిన నిధులు కేటాయింపులు చేసింది. ఆర్థిక మంత్రి రూ.1529 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రోత్సాహంతో గడిచిన ఏడాది రూ. 1935 కోట్ల 27 లక్షల గుడ్ల ఉత్పత్తితో రాష్ట్రం దేశంలో 3వ స్థానాన్ని చేరుకుంది. 11 లక్షల 58 వేల టన్నుల మాంసం ఉత్పత్తి చేసి దేశంలో 5వ స్థానంలో నిలిచింది. రాష్ట్ర జి.ఎస్.డి.పి. కి పశుసంవర్ధక రంగం 1 లక్ష 3 వేల 525 కోట్ల రూపాయలు అందించగా, మత్స్య రంగం రూ.7763 కోట్లు అందించింది. కోహెడలో రూ. 47 కోట్లతో హోల్ సేల్ చేపల మార్కెట్ ను నిర్మించనుంది.
కార్మిక సంక్షేమానికి రూ. 998 కోట్లు..
తెలంగాణ కార్మిక శక్తిని బలోపేతం చేయడం కోసం రూ. 998 కోట్లు బడ్జెట్లో కేటాయింపులు చేసింది. కార్మిక సంక్షేమం, పరిశ్రమలకు అనుకూల వాతావరణం, పని ప్రదేశాల్లో భద్రతను ప్రోత్సహిస్తూ రాష్ట్రం ముందుకు సాగుతోంది. టి-గేట్ డిజిటల్ వేదిక ద్వారా నైపుణ్యాభివృద్ధి, కెరీర్ మార్గదర్శనం, ఉపాధి కల్పన సేవలు అందించనుంది. బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు కింద 1,03,000 మంది కార్మికులను నమోదు చేసి, 55,594 లబ్ధిదారులకు రూ. 276.78 కోట్లను పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్రంలోని 118 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో (ఏటసీ) శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ప్రభుత్వం నెలకు రూ. 2 వేల చొప్పున స్కాలర్‌షిప్ అందించనుంది.
చేనేత రంగానికి రూ. 258 కోట్లు..
రాష్ట్రంలో చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ బడ్జెట్లో రూ. 258 కోట్ల ప్రతిపాదనలు చేసింది. ఇప్పటికే తెలంగాణ హ్యాండ్లూమ్, పవర్లూమ్ రంగాలు దేశంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. పోచంపల్లి, ఇక్కత్, గద్వాల్, నారాయణపేట, సిద్దిపేట, గొల్లభామ చీరలు, వరంగల్దుప్పట్లు, హ్యాండ్లూమ్ ఉత్పత్తులు మన సంస్కృతి, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. కోటి మంది మహిళలకు కోటి చీరల కార్యక్రమం ద్వారా ఉచితంగా ఇప్పటికే 70 లక్షల చీరలు అందజేశారు. మిగిలిన చీరలను అతి త్వరలో పంపిణీ చేస్తారు.






