Thummala: వచ్చే మూడేళ్లలో గోదావరి జలాలతో రైతుల పాదాలు కడుగుతా: తుమ్మల

by Prasad Jukanti |   (  Updated:2026-01-13 06:21:22  IST  )

మంత్రి తుమ్మల మంచుకొండ ఎత్తిపోతల పథకం జాతికి అంకితం

Thummala: వచ్చే మూడేళ్లలో గోదావరి జలాలతో రైతుల పాదాలు కడుగుతా: తుమ్మల
X

దిశ, డైనమిక్ బ్యూరో: రైతులు పచ్చని పైరులతో పరిఢవిల్లాలనేది తన ఆకాంక్ష అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) అన్నారు. ఇవాళ ఖమ్మం జిల్లా రఘునాథపాలేం మడలంలో మంచుకొండ ఎత్తిపోతలను (Manchukonda Lift Irrigation Project) ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఓ న్యూస్ చానల్‍తో మాట్లాడుతూ.. రాబోయే మూడేళ్లలో ఖమ్మం, కొత్తగూడెం జిల్లా రైతుల పాదాలను గోదావరి జలాలలో కడగడమే తన జీవిత లక్ష్యం అని చెప్పారు. గతేడాది జనవరి 13న బోగి పండగ రోజు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పామని చెప్పిన మాట ప్రకారం పూర్తి చేసి జాతికి అంకితం ఇచ్చామన్నారు. జిల్లాలోనే అన్ని మండలాలకంటే కరువు మండలంగా ఉన్న రఘునాథపాలేం వచ్చే మూడేళ్లలో పచ్చని పంటలతో పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. కాగా సాగర్ జలాలను మళ్లించి 2 పంటలకు సాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును నిర్మించారు. మంచుకొండ లిఫ్ట్‌తో 2,412 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది.

Next Story