కౌలు రైతులకే ఎరువుల కష్టాలు

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో కౌలు, సన్న, చిన్నకారు రైతులే ఎరువుల సమస్యలు ఎదుర్కొంటున్నారు. పెద్ద భూస్వాములు ఫర్టిలైజర్​ యాజమానుల నుంచి రూ. 100 నుంచి రూ.120 వరకు అదనంగా చెల్లించి తీసుకున్నట్లు తెలిసింది.

కౌలు రైతులకే ఎరువుల కష్టాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కౌలు, సన్న, చిన్నకారు రైతులే ఎరువుల సమస్యలు ఎదుర్కొంటున్నారు. పెద్ద భూస్వాములు ఫర్టిలైజర్​ యాజమానుల నుంచి రూ. 100 నుంచి రూ.120 వరకు అదనంగా చెల్లించి తీసుకున్నట్లు తెలిసింది. ప్రతి ఏటా విత్తనాలు, ఎరువుల కొరత అనేది సాధారణంగా జరిగే విషయమే. దీనిని దృష్టిలో పెట్టుకుని పెద్ద రైతులు ముందు చూపుతో ఎరువుల దుకాణదారులకు టచ్​లో ఉంటూ స్టాక్​ రాగానే తనకు పంపించాలని కోరడంతో వారు వచ్చిన రెండు రోజులకే పంపిస్తున్నారు. అదే కౌలు రైతులు అప్పులు చేసి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే పరిస్థితి. నగదు సిద్దం చేసుకునే సమయానికి అప్పటికే ఎరువుల సగానికి పైగా విక్రయాలు జరుగుతాయి. ఉన్న సగం ఎరువులకు తీవ్ర పోటీ ఉంటుంది. దీంతో ఎరువుల షాపుల యాజమానులు ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువకు అమ్మకాలు చేస్తారు. ఇదే అదును భావించి షాపుల్లో స్టాక్​ఉంచడకుండా గోదాములు దాచిపెట్టి బ్లాక్​దందా సాగిస్తారు. ప్రస్తుతం బస్తా డిఏపీ రూ. 1350 కాగా, రూ. 1500 లకు, బస్తా యూరియా రూ. 266 కాగా రూ. 380 లకు అమ్మకాలు చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే రైతులు కేంద్ర ప్రభుత్వం సరిపడ ఎరువులు రాష్ఠ్రానికి సరఫరా చేయలేదని ఉన్న సరుకులనే అమ్ముతున్నట్లు సమాధానం చెబుతూ ఇష్టం ఉంటే తీసుకో లేదంటే ఇతరులకు అమ్మకాలు చేస్తామని హెచ్చరిస్తున్నట్లు తెలిసింది. కౌలు, సన్న, చిన్నరైతులు వ్యవసాయం చేయడం మోయలేని భారంగా మారిందని రైతు సంఘాలు చెబుతున్నాయి.

ఇప్పటివరకు 3.07 లక్షల మెట్రిక్​టన్నులు సరఫరా : ఈ సీజ‌న్‌కు సంబంధించి మూడు నెల‌ల మ‌ధ్య 5 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల‌కు కేవలం 3.07 ల‌క్షల మెట్రిక్ ట‌న్నులు మాత్రమే స‌ర‌ఫ‌రా జరిగింది. జులై నెలకు సంబంధించి 63 వేల మెట్రిక్ ట‌న్నులు దేశీయంగా ఉత్పత్తి అయిన యూరియా, 97 వేల మెట్రిక్ ట‌న్నుల విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకున్న యూరియా రాష్ట్రానికి స‌ర‌ఫ‌రా చేయాల్సి ఉండ‌గా ఇప్పటి వ‌ర‌కు కేవ‌లం 29 వేల మెట్రిక్ ట‌న్నుల యూరియా సరఫరా జరిగింది. ఈ వానాకాలం పంటల సాగుకు రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం కేటాయించి మూడు నెలలు గడిచిన ఇంకా ఆలస్యం జరగడం రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

వానాకాలంలో పెరిగిన పంట సాగు : ఈ పంట కాలంలో సుమారు 1.32 లక్షల ఎకరాలు పంటలు వేయడం జరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వాటిలో వరి 66.78 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 5.23, పత్తి 44.75, మిర్చి 1.90, సోయాబీన్ 3.80, కంది 5.21 లక్షల ఎకరాలు పంట సాగు అవుతున్నట్లు పేర్కొంది. ఇటీవల కురిసిన అడపా దడపా వానలకు 45 లక్షల ఎకరాల్లో పంట సాగు జరిగింది. పత్తి 32 లక్షలు, 2.50 లక్షల ఎకరాలు, పెసలు 28,600 ఎకరాలు, జోన్న 24, 040, మొక్కజోన్న 2.51,400 ఎకరాలు, కందులు 2.85 లక్షలు, సోయాబీన్​3.01 లక్షల ఎకరాలు, చెరకు 15 వేల ఎకరాలు సాగు చేసినట్లు ప్రభుత్వం గణాంకాలు వెల్లడించాయి. పెద్ద రైతులు ముందుగానే ట్రాక్టర్​లోడ్​యూరియా బస్తాలను తీసుకెళ్లుతున్నారు. దీంతో చిన్న, సన్నకారు రైతులకు దొరకడం లేదు. స్ధానికంగా ఉండే ఎరువుల దుకాణదారులు చిన్న రైతులకు ఇవ్వడం లేదనే ప్రచారం జరుగుతోంది.

యూరియా కొరత లేకుండా చర్యలు చేపట్టాలి : రైతు ఐక్యవేదిక అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి

రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తక్షణమే యూరియా కొరత లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఖరీఫ్ కు అవసరాలకు సరిపడా యూరియాను కేటాయించాలని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఎరువుల కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందనీ, ఎరువుల కోరత ఉన్నప్పటికీ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు మాట్లాడకపోవడం విచారకరమన్నారు. ప్రైవేట్ వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి కృత్రిమ కొరతను సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. పంటలకు సరైన సమయంలో యూరియా వేయకపోతే దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. రైతుల వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని యూరియా కొరత లేకుండా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Next Story