- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో పంట మార్పిడికి ఇదే సరైన సమయం.. మంత్రి తుమ్మలకు రైతు కమిషన్ నివేదిక
రాష్ట్రంలో రెండు పంట సీజన్లలో 1.30 కోట్ల ఎకరాల్లో వరి సాగు జరుగుతోందని, వచ్చే మూడు సంవత్సరాల్లో అందులో కనీసం 13 లక్షల ఎకరాలను ఉద్యాన పంటలు, ఆయిల్‌సీడ్స్ సాగుకు రైతులను మళ్లించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రెండు పంట సీజన్లలో 1.30 కోట్ల ఎకరాల్లో వరి సాగు జరుగుతోందని, వచ్చే మూడు సంవత్సరాల్లో అందులో కనీసం 13 లక్షల ఎకరాలను ఉద్యాన పంటలు, ఆయిల్‌సీడ్స్ సాగుకు రైతులను మళ్లించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు. పంట మార్పిడిలో మార్కెట్ లో డిమాండ్ ఉండే పంటలు సూచిస్తే రైతులకు గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉందన్నారు. శనివారం సచివాలయంలో రైతు కమిషన్చైర్మన్కోదండ రెడ్డితో పాటు సభ్యులు పంట మార్పిడిలపై నివేదిక అందజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఈ సంవత్సరంలో 45 వేల ఎకరాలలో కొత్తగా ఆయిల్ పామ్ సాగును తీసుకురాగా వచ్చే సంవత్సరంలో 1 లక్ష ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేసేలా ప్రణాళిక తయారు చేస్తామన్నారు.
కేంద్రం తయారుచేసిన విత్తనచట్టంలో కూడా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, ఈ చట్టంలో నకిలీ విత్తనాల వలన రైతులు నష్టపోతే, రైతులకు చెల్లించాల్సిన పరిహారం విషయంలో ఎలాంటి స్పష్టత లేదన్నారు. విత్తన నియంత్రణలో కేంద్రంతో పాటు రాష్ట్రాలకు కూడా సముచిత అధికారాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఖరీఫ్ సీజన్ కి సంబంధించి జూన్ మొదటి వారంలో నాట్లు వేసే అవకాశాలు ఉన్నాయని, మే నెలాఖరు వరకు రాష్ట్రంలో తగినంత యూరియా బఫర్ నిల్వలు సిద్ధంగా ఉంచుకోవాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రానికి కేటాయించిన యూరియా కేటాయింపులకు అనుగుణంగా కేంద్రం సరఫరా చేసేలా కేంద్ర అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని, అవసరమైతే ఢిల్లీకి వెళ్లి నేరుగా కేంద్ర అధికారులను కలిసి, యూరియా సరఫరాలో జాప్యం జరగకుండా చూసేలా కోరాలని సూచించారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే యూరియాలో తెలంగాణ రాష్ట్రానికి 90 శాతం కేటాయించి, సరఫరా చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీడ్ కార్పోరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, ఉద్యానశాఖ డైరెక్టర్ యాస్మీన్ బాషా, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.






