- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Harish Rao : రైతులు రోడ్ల మీద.. ప్రభుత్వం మొద్దు నిద్రలో : హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు(BRS MLA Harish Rao) మండిపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు(BRS MLA Harish Rao) మండిపడ్డారు. రైతులు ఎరువుల కోసం మండుటెండల్లో నిలబడుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్రలో జోగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న మహబూబాబాద్(Mahabubabad) జిల్లాలో యూరియా(Urea) పంపిణీ కోసం పోలీసులు టోకెన్లు జారీ చేస్తే, నేడు జగిత్యాల(Jagithyala)లో రైతులు పాస్ బుక్కులు, ఆధార్ కార్డులు క్యూలో పెట్టిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఉమ్మడి రాష్ట్రంలోని రైతుల కన్నీళ్ల కడగండ్లను పునరావృతం చేస్తున్నదన్నారు. బీఆర్ఎస్ పాలనలో రైతే రాజుగా ఉన్న తెలంగాణలో రైతన్నను నట్టేట ముంచి, నడి రోడ్డు మీదకు తెచ్చిన ఘనత రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కే దక్కుతుందని ఎద్దేవా చేశారు.
రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. యూరియా కోసం రైతులు మండుటెండల్లో తంటాలు పడుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండటం దుర్మార్గం అని మండిపడ్డారు. రైతు డిక్లరేషన్ అని దగా చేసి, రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్ పేరుతో మోసం చేసారని పేర్కొన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను కంట నీరు పెట్టిస్తున్నరని, ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతాంగానికి అవసరమైన యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు తన ఎక్స్ ఖాతా వేదికగా ట్వీట్ చేశారు.






