- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS vs BJP: బీజేపీలోకి ‘ఫామ్ హౌస్' కేసు ఎమ్మెల్యేల క్యూ..?
తెలంగాణ రాజకీయాల్లో చేరికల రాజకీయం మరోసారి హాట్ టాపిక్ అయింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) పార్టీకి మరో బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ హయాంలో కలకలం రేపిన ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో (Farm House Case) కీలకంగా వ్యవహరించిన నాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి (BJP) చేరేందుకు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఒకరిగా ఉన్న అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇప్పటికే కమలం తీర్థం పుచ్చుకోగా అదే బాటలో పైలట్ రోహిత్‌రెడ్డి సైతం వెళ్లేందుకు సిద్ధమయ్యారని, నేడో, రేపో ఆయన కండువా మార్చేందుకు రెడీ అయినట్లు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.
కొంతకాలంగా సైలెంట్..
2022లో మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోహిత్ రెడ్డి (Pilot Rohit Reddy) కీలకంగా ఉన్నారు. ఆయనతోపాటు నాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, గువ్వల బాలరాజులు ఉండగా, వీరంతా ఒక్కొక్కరుగా బీజేపీ వైపు చూస్తుండటంతో బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పైలట్ సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలోనే ఆయనపై ఈడీ కేసులు, ఆయన స్నేహితుడిగా ప్రచారం జరుగుతున్న సినీ నిర్మాత, డ్రగ్ కేసులో నిందితుడిగా ఉన్న కేదార్ దుబాయ్‌లో అనుమానాస్పద మృతి తర్వాత రోహిత్ రెడ్డి ఎక్కడా కనిపించకుండా పోయారనే టాక్ వినిపిస్తోంది.
విలీనం ప్రచారం వేళ మరిన్ని ఇక్కట్లు..
ఇప్పటికే ఇంటా, బయటా సమస్యలతో క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజా పరిణామాలను ఎలా ఎదుర్కొంటారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసిన కేసులో అధినేతకు అండగా ఉన్న నేతలు ఒక్కొక్కరుగా కారు దిగిపోతుండటంతో గులాబీ శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తారనే ప్రచారం జోరందుకుంటున్న వేళ ఈ పరిణామాలు మరింత ఇబ్బందికరంగా మారాయి.






