- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
DGP: డీజీపీ పదవీ విరమణ కార్యక్రమం.. ఆమెను గుర్తుచేసుకుని కంటతడి
తెలంగాణ పోలీస్ అకాడమీలో డీజీపీ జితేందర్ ఫేర్వేల్ పరేడ్ ఘనంగా నిర్వహించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోనే తెలంగాణ పోలీస్ నంబర్ వన్ స్థానంలో ఉందని, జాతీయ స్థాయిలో రాష్ట్ర పోలీసులకు మంచి గుర్తింపు వచ్చిందని డీజీపీ జితేందర్ (DGP Jitender) అన్నారు. డీజీపీ జితేందర్ పదవి విరమణ కార్యక్రమం ఇవాళ తెలంగాణ పోలీస్ అకాడమీలో (Telangana Police Academy) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జితేందర్.. తనకు డీజీపీగా అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తాను డీజీపీగా ఉన్న 15 నెలల్లో శాంతిభద్రతలు అదుపులోకి తేగలిగామని, రాష్ట్రంలో నేరాల రేటు తగ్గించేందుకు పలు చర్యలు చేపట్టామన్నారు. కామారెడ్డి, నిజామాబాద్ వరదల్లో అనేక మంది ప్రాణాలను కాపాడామన్నారు. బెట్టింగ్ మాఫియాపైనా లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, నార్కొటిక్స్, సైబర్ క్రైమ్ నేరాల కట్టడికి నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. నేరాల ఛేదనలో టెక్నాలజీ చాలా కీలకంగా మారిందని, రాష్ట్రంలో 10 లక్షల సీసీ కెమెరాలతో నిఘా ఉందన్నారు. సంచలనం సృష్టించిన పలు కేసులను 48 గంటల్లోనే ఛేందించామన్నారు.






