- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాఖీ పౌర్ణమి స్పెషల్ బస్సుల్లో మాత్రమే ఛార్జీల సవరణ
రాఖీ పౌర్ణమి స్పెషల్ బస్సుల్లో మాత్రమే ఛార్జీల సవరణ ఆసంస్దపై అసత్య ప్రచారం చేయడం సరికాదు

రాఖీ పౌర్ణమి స్పెషల్ బస్సుల్లో మాత్రమే ఛార్జీల సవరణ
ఆసంస్దపై అసత్య ప్రచారం చేయడం సరికాదు
స్పెషల్బస్సుల చార్జీల సవరణ అనవాయిగా జరుగుతుంది : టీజీఎస్ఆర్టీసీ
దిశ, తెలంగాణ బ్యూరో : రాఖీ పౌర్ణమి సందర్భంగా టికెట్ ఛార్జీలను టీజీఎస్ఆర్టీసీ పెంచిందని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ఆర్టీసీ యాజమాన్యం కొట్టిపారేసింది. మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ కొందరు పనిగట్టుకొని ఉద్దేశపూర్వకంగా సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగేలా చేస్తున్న ఈ అబద్ధపు ప్రచారాన్ని ఖండించింది. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం రాఖీకి ఈ నెల 7వ తేది నుంచి 11వ తేది వరకు నడిచిన స్పెషల్ బస్సుల్లో మాత్రమే చార్జీలను సవరించామని, రెగ్యులర్ సర్వీస్‌ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు చేయలేదని స్పష్టం చేసింది. ప్రయాణికుల రద్దీ మేరకు 4,650 ప్రత్యేక బస్సులను సంస్థ నడిపించింది. ఈ నెల 7న 407, 8న 960, రాఖీ పండుగ(9న)1,570, 10న 781, 11న 932 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
ఈ స్పెషల్ బస్సులు మినహా మిగతా బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉన్నాయి. ప్రస్తుతం సంస్థలో 9500 పైగా బస్సులు సేవలందిస్తున్నాయి. అందులో కొన్నింటినే స్పెషల్ సర్వీసులుగా రద్దీ రూట్లలో నడపడం జరిగిందని తెలిపింది. స్పెషల్ బస్సులకు చార్జీల సవరణ అనవాయితీగా జరుగుతుందని, పండుగల సమయాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో చార్జీల సవరణ అనేది జీవో ప్రకారం 22 ఏళ్లుగా కొనసాగుతోంది. పండుగ రద్దీ రోజుల్లో స్పెషల్ బస్సులు మినహా సాధారణ రోజుల్లో యథావిధిగా సాధారణ టికెట్ ధరలే అమల్లో ఉంటాయి. ఇది సంస్థలో సంప్రదాయంగా కొనసాగుతున్న ప్రక్రియ. అదేం తెలియకుండా కొందరు పండుగ పేరుతో అన్ని సర్వీసుల్లో చార్జీలను పెంచినట్లు ఉద్దేశపూర్వకంగా సంస్థపై అసత్య ప్రచారం మంచి పద్దతి కాదని వెల్లడించింది. టీజీఎస్ఆర్టీసీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా చేస్తోన్న ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది.






