‘ఈ జన్మకు ఇదే చాలు!’ నందినగర్‌లో కేసీఆర్ దర్శనం.. ఉప్పొంగిన అభిమానం

by Ramesh Naini |

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడం జీవితంలో మరిచిపోలేని క్షణంగా కార్యకర్తలు, అభిమానులు భావించారు.

‘ఈ జన్మకు ఇదే చాలు!’ నందినగర్‌లో కేసీఆర్ దర్శనం.. ఉప్పొంగిన అభిమానం
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడం జీవితంలో మరిచిపోలేని క్షణంగా కార్యకర్తలు, అభిమానులు భావించారు. మంగళవారం హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి ఉదయం నుంచే నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. దాదాపు నాలుగు గంటల పాటు వారికి గులాబీ బాస్ సమయం కేటాయించి, వెయ్యికి పైగా మందితో ఫోటోలు దిగారు. దీంతో నంది నగర్ పరిసరాలు కార్యకర్తలతో సందడిగా మారింది. క్యూ కట్టి ఒక్కొక్కరిగా వచ్చి ఆయనను కలిసి ఫోటోలు దిగారు.

ఈ సందర్భంగా.. ‘కేసీఆర్‌ను కళ్లారా చూడడం జీవితంలో దక్కిన గొప్ప వరం. ఈ జన్మకి ఇదే చాలు.. ఇంకేం అక్కర్లేదు సార్!’ అంటూ ఓ అభిమాని చెప్పిన మాటలు అక్కడున్న వారిని కదిలించాయి.మరో కార్యకర్త మాట్లాడుతూ.. ‘ఆయనతో ఫోటో దిగడం అదృష్టంగా భావిస్తున్నాం. కేసీఆర్ మళ్లీ తెలంగాణకు నాయకత్వం వహించాలి’ అని ఆకాంక్షించారు. కేసీఆర్‌ను కలవడంపై పార్టీ శ్రేణుల్లో అభిమానం ఉప్పొంగింది. వీడియో ఇదే..

Next Story