- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jubilee Hills: జూబ్లీహిల్స్ పై ఫేక్ సర్వేలు!..దాచితే వాస్తవాలు దాగేనా?
జూబ్లీహిల్స్ బై పోల్ ప్రధాన పార్టీలకు అగ్నిపరీక్షగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By Poll) కీలకంగా మారింది. ప్రధాన పార్టీలు ఇక్కడ జెండా పాతేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టిన పార్టీలు క్షేత్ర స్థాయిలో పార్టీ క్యాడర్‍తో వరుస మీటింగ్ లతో ఈ సెగ్మెంట్‍లో హల్ చల్ చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు అగ్నిపరీక్షగా మారిన ఈ బై పోల్ కోసం ఈ మూడు పార్టీలు గెలుపే లక్ష్యంగా లెక్కలు వేసుకుంటుంటే సోషల్ మీడియాలో రకరకాల సర్వేలు హల్చల్ చేస్తున్నాయి. వీటిలో వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేలు అడపదడపా ఉంటే అత్యధిక భాగం ఫేక్ సర్వేలే (Fake Surveys) సోషల్ వైరల్ అవుతున్నాయి. వీటిల్లో తమకు అనుకూలంగా ఉన్న క్లిప్పింగ్‍లను ఆయా పార్టీలు మద్దతు దారులు సోషల్ మీడియాలో ఊదరగొడుతుండటంతో నియోజకవర్గంలోని ఓటర్లు వాస్తవంగా ఎటువైపు ఉండబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది.
సర్వేలపైనే పార్టీలో దృష్టి:
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు సవాలుగా మారింది. ఇక్కడ విజయం సాధించడం అంటే రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో మరిన్ని సానుకూలతలు సాధించడమే అనే అభిప్రాయం ఏర్పడింది. దీంతో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న రాజకీయ పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుని అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికతో పాటు పార్టీ ప్రచారాంశాల విషయంలోనూ ప్రధాన పార్టీలు సర్వేలపైనే ఆధారపడ్డాయి. ఎవరికి వారు సర్వేలు నిర్వహించికును ప్రత్యర్థులను చిక్కుల్లో నెట్టేలా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు పలు అంశాలపై సర్వే నిర్వహించగా ఆ ఫలితాల ఆధారంగా వ్యూహరచన చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎవరికి వారు గెలుస్తామని ధీమా వ్యక్తం చేయడం రాజకీయాల్లోసహజమే అయినా సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఫేక్ సర్వేల పేరుతో చేస్తున్న హల్చల్ వల్ల పార్టీల వాస్తవ పరిస్థితులు దాగుతాయా ఫలితాల నాటికైనా బయటపడాల్సిందే కదా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంకా నోటిఫికేషన్ షెడ్యూల్ రాకముందే జరుగుతున్న ఈ సర్వేల ప్రచారం అంతిమంగా ఎవరికి మేలు చేస్తుంది ఎవరికి డ్యామేజ్ చేయబోతున్నది అనేది కాలమే నిర్ణయించనుంది.






