Fake Notes: మహిళా పొదుపు సంఘాల్లో నకిలీ నోట్లు కలకలం

by Prasad Jukanti |   (  Updated:2025-12-13 04:40:13  IST  )

మహిళా పొదుపు సంఘాల్లో ఫేక్ నోట్లు కలకలం రేపుతున్నాయి.

Fake Notes: మహిళా పొదుపు సంఘాల్లో నకిలీ నోట్లు కలకలం
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా ప్రభుత్వ మహిళా పొదుపు సంఘాలను (Women Self Help Groups) ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు నడుము బగించింది. ఇటువంటి మహిళా పొదుపు సంఘంలో ఇప్పుడు నకిలీ నోట్లు (Fake Currency Notes) కలకలం రేపుతున్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ (Vemulawada) పురపాలక సంఘం పరిధిలోని మహిళా పొదుపు సంఘాల్లో నకిలీ నోట్లు రావడం సంచలనంగా మారింది. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాల కిస్తీలను ప్రతినెల చెల్లించే క్రమంలో సంఘ సభ్యుల నుంచి వస్తున్న రూ.500 నోట్లలో నకిలీవి దర్శనం ఇస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. వేములవాడ పట్టణంలోని ఓ మహిళా పొదుపు సంఘానికి చెందిన సభ్యులు టీమ్ లీడర్‍కు తమ ఈఎంఐలకు సంబంధించిన నగదునుఅప్పగించారు. సంఘం సభ్యులు ఇచ్చిన ఆ డబ్బును సదరు లీడర్ తీసుకుని నిన్న బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళ్లగా అందులో నకిలీ నోటు బయటపడింది. ఈ విషయం తెలియడంతో గ్రూప్ సభ్యులు షాక్ తిన్నారు. అయితే ఇప్పటికే గతంలో రెండుసార్లు నకిలీ నోటు వచ్చిందని ఇది మూడోసారి అంటూ గ్రూప్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మహిళా పొదుపు సంఘాలలో నకిలీ నోట్ల వ్యవహారం హాట్ టాపిక్‍గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా పొదుపు సంఘాలు ఉన్న నేపథ్యంలో నకిలీ నోట్ల విషయంలో గ్రూప్ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు.

Next Story