- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీకు క్యాన్సర్ కావాలా..? ఈ అల్లంవెల్లులి పేస్ట్ తింటే చాలు..!
హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మరోమారు కల్తీ ఆహార పదార్థాల మాఫియాపై బాగోతాన్ని బట్టబయలు చేశారు.

దిశ, సిటీ క్రైం: హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మరోమారు కల్తీ ఆహార పదార్థాల మాఫియాపై బాగోతాన్ని బట్టబయలు చేశారు. మానవ శరీరంలో డీఎన్ఏను నాశనం చేయగల ప్రమాదకర రసాయనాలు కలిపి అల్లం వెల్లులి పేస్ట్ తయారుచేస్తూ ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుతున్న వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పటేల్ నగర్, బండ్లగూడ ప్రాంతంలో "ఫారూక్ ఎఫ్ కే ఫుడ్స్" పేరుతో ఈ తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఫారూక్ అనే వ్యక్తిని మంగళవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 870 కిలోల నకిలీ అల్లం వెల్లులి పేస్ట్, 4 కిలోల టైటానియమ్ డైయాక్సైడ్, 16 కిలోల మోనో సిట్రేట్ వంటి ప్రమాదకర కెమికల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, అల్లం వెల్లులి పేస్ట్ మెరుపుతో కనిపించేలా చేయడానికి ఫారూక్ టాల్కమ్ పౌడర్‌లలో వాడే టైటానియమ్ డైయాక్సైడ్ అనే రసాయనాన్ని కలుపుతున్నాడు. ఇది మానవ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తించారు. ఈ కెమికల్ మానవ శరీరంలో డీఎన్ఏను ధ్వంసం చేసి క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీస్తుందనే నివేదికలున్నాయని తెలిపారు. ఇటీవల ఇదే రకంగా ఫారూక్ సోదరుడు కూడా కల్తీ అల్లం వెల్లులి పేస్ట్ తయారీ కేసులో అరెస్ట్ అయ్యాడని, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ దందాను ఆపేశాడని పోలీసులు గుర్తించారు. అయితే ఇప్పుడు ఫారూక్ మళ్లీ అదే వ్యాపారాన్ని వేరే రూపంలో ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మరింత విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






