బరితెగించిన కేటుగాళ్లు.. సీపీ సజ్జనార్ పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతా వెలుగులోకి!

by Jakkula.Mamatha |

హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతా సృష్టించి , ఏకంగా తన స్నేహితుడికే వలవేసి 20 వేలు స్వాహా చేసినట్టు కమిషనర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

బరితెగించిన కేటుగాళ్లు.. సీపీ సజ్జనార్ పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతా వెలుగులోకి!
X

దిశ, జూబ్లీహిల్స్: హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతా సృష్టించి , ఏకంగా తన స్నేహితుడికే వలవేసి 20 వేలు స్వాహా చేసినట్టు కమిషనర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తన ఫేస్బుక్ , ఇతర సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు సృష్టించి తన స్నేహితులకు అవసరం ఉందని డబ్బులు అడుగుతున్నారని , అటువంటి నకిలీ ఖాతాలపై ఎవరు స్పందించ వద్దని సజ్జనార్ తెలిపారు.

నకిలీ ఫేస్ బుక్ ఖాతా లో మెసేజ్‌ నిజమని నమ్మిన ఓ స్నేహితుడు రూ.20 వేలు పంపి మోసపోయారని తెలిపారు. డబ్బులు పంపాలని వచ్చే మెసేజ్‌లను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద లింక్‌లు, మెసేజ్‌లు, వీడియో కాల్స్‌ వస్తే బ్లాక్‌ చేయాలని సూచించారు. ఆయా సైట్లు బ్లాక్‌ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నాని ఎక్స్‌ వేదికగా సూచించారు.

'నా పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ ఖాతాలు సృష్టించి, నా స్నేహితులకు ‘నేను ఆపదలో ఉన్నాను. డబ్బులు పంపించండి’ అని సైబర్ నేరగాళ్లు సందేశాలు పంపిస్తున్నారు. దురదృష్టవశాత్తు, నిజమే అనుకొని నా స్నేహితుడు ఒకరు రూ.20,000 ను మోసగాళ్ల ఖాతాకు పంపారు. నా వ్యక్తిగత ఫేస్ బుక్ పేజీ లింక్ ఇది.. https://facebook.com/share/1DHPndApWj/. ఇది మినహా నా పేరుతో ఉన్న మిగతా ఖాతాలన్నీనకిలివే. ఈ ఫేక్ ఖాతాలను మెటా సహకారంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ టీం తొలగించే పనిలో ఉంది.

నా పేరుతో, లేదా ఏ అధికారి/ ప్రముఖ వ్యక్తి పేరుతో ఫేస్ బుక్‌లో వచ్చే రిక్వెస్ట్‌లను స్పందించకండి. డబ్బులు పంపాలని వచ్చే సందేశాలను అసలు నమ్మకండి. ఒకవేళ అలా ఎవరైనా మెసేజ్‌లు చేస్తే.. ముందుగా ఫోన్ ద్వారా వ్యక్తిని స్వయంగా సంప్రదించి పరిశీలించండి. అనుమానాస్పద లింకులు, మెసేజ్‌లు, వీడియో కాల్‌ లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి. సైబర్ మోసాలను వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు లేదా https://cybercrime.gov.in లో రిపోర్ట్ చేయండి. మనమంతా జాగ్రత్తగా ఉంటేనే.. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా మనల్ని, మన డబ్బును కాపాడుకోగలం.' అని సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు.

Next Story