- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Fake clipping: ‘దిశ’ పేరుతో ఫేక్ క్లిప్పింగ్స్
దిశ పేరుతో వైరల్ అవుతున్న క్లిప్పింగ్ పై యాజమాన్యం స్పందించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పత్రికా రంగంలో ‘దిశ’ దిన పత్రికకు (Disha Newspaper) రోజురోజుకూ వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక కొందరు ‘దిశ’ లోగోతో ఫేక్ వార్తలను (Fake News) సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ‘దిశ’ పత్రికకు సంబంధించినట్లు ప్రచారం అవుతున్న వార్తలు పూర్తిగా ఫేక్, నిరాధారమైనవని ‘దిశ’ యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో కొందరు కావాలనే ఈ తరహా అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. ‘దిశ’ పత్రిక ఎప్పటికీ నిజాలు, ప్రజాస్వామ్య విలువలు, జర్నలిజం నైతిక ప్రమాణాలకు కట్టుబడి పనిచేస్తున్నదని, తమ పత్రికకు విశ్వసనీయత, పారదర్శకతకు ఉందని యాజమాన్యం తెలిపింది. పత్రిక పేరు ఉపయోగించి జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారాలతో ‘దిశ’కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రజలు ఇలాంటి వార్తలను నమ్మే ముందు దాని మూలాన్ని పరిశీలించాలని, అధికారికంగా ‘దిశ’ పత్రికలో ప్రచురితమైన వార్తలనే నమ్మాలని విజ్ఞప్తి చేసింది. ఫేక్ వార్తలను షేర్ చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరింది. ‘దిశ’ పత్రికపై జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారాలపై అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు కూడా యాజమాన్యం వెల్లడించింది.






