Alert: ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. ఏసీబీ పేరుతో ఫేక్ కాల్స్.. డీజీ కీలక ప్రకటన

by Ramesh Naini |

ఏసీబీ అధికారుల పేరుతో ఫేక్ కాల్ చేసిన వ్యక్తి పై ఏసీబీ అధికారుల ఫిర్యాదుతో సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Alert: ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. ఏసీబీ పేరుతో ఫేక్ కాల్స్.. డీజీ కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: (ACB) ఏసీబీ అధికారుల పేరుతో (Fake calls) ఫేక్ కాల్ చేసిన వ్యక్తి పై ఏసీబీ అధికారుల ఫిర్యాదుతో (Saifabad Police Station) సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏసీబీ పేరుతో ప్రభుత్వ అధికారులను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వివరాలను ఏసీబీ డీజీ విజయ్ కుమార్ మంగళవారం ప్రకటనలో వెల్లడించారు. ఏసీబీ పేరుతో వచ్చే ఫేక్ కాల్స్ నమ్మవద్దని డీజీ ప్రభుత్వ ఉద్యోగులకు సూచించారు. ప్రభుత్వ అధికారులు ప్రైవేటు వ్యక్తలను డబ్బులు డిమాండ్ చేసినట్లయితే ఏసీబీకి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఏసీబీ టోల్ ఫ్రీ 1064 కి సంప్రదించాలని తెలిపారు.

Next Story