నిజామాబాద్ కాంగ్రెస్‌లో ముదిరిన వర్గపోరు: ముగ్గురు కీలక నేతలపై సస్పెన్షన్ వేటు

by Kema Shiva Kumar |

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం. క్రమశిక్షణ ఉల్లంఘన కింద పార్టీ నుంచి ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

నిజామాబాద్ కాంగ్రెస్‌లో ముదిరిన వర్గపోరు: ముగ్గురు కీలక నేతలపై సస్పెన్షన్ వేటు
X

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ (Nizamabad) కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ముగ్గురు కీలక నేతలను పార్టీ నుంచి సస్పెండ్ (Suspend) చేస్తూ రాష్ట్ర అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్‌కు గురైన నేతల్లో ఎన్ఎస్‌యూఐ మాజీ రాష్ట్ర కార్యదర్శి వేణు రాజు, జిల్లా కార్యదర్శి నరన్ దీప్, 48వ డివిజన్ మాజీ అధ్యక్షుడు పుండ్ర సాయి కిరణ్ ఉన్నారు. అయితే, గత కొంతకాలంగా జిల్లాలోని సీనియర్ నేతల మధ్య ఉన్న వర్గ విభేదాలు ఈ యువ నాయకుల సస్పెన్షన్‌కు కారణమైనట్లుగా తెలుస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని వీరిపై ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆదేశాల మేరకు వీరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Next Story