ఫేక్ ఆడియోతో వైరల్ అయిన సీఎం వీడియో.. అసలు విషయం బయట పెట్టిన ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ

by Ramesh Naini |

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 6న శనివారం ట్యాంక్ బండ్‌ను ఆకస్మికంగా సందర్శించి గణేశ్ విగ్రహాల నిమజ్జన ప్రక్రియను పరిశీలించారు.

ఫేక్ ఆడియోతో వైరల్ అయిన సీఎం వీడియో.. అసలు విషయం బయట పెట్టిన ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సెప్టెంబర్ 6న శనివారం ట్యాంక్ బండ్‌ను ఆకస్మికంగా సందర్శించి గణేశ్ విగ్రహాల నిమజ్జన ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్శనకు సంబంధించిన వీడియోకు ఫేక్ ఆడియో జోడించి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారని (Fact Check) ఫ్యాక్ట్‌ చెక్‌ తెలంగాణ @FactCheck_TG అసలు విషయం బయట పెట్టింది. ఆదివారం ఎక్స్ వేదికగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం ఆపండని వెల్లడించింది. వాస్తవానికి, అసలు వీడియోలో రోడ్డు రద్దీ, ప్రజల శబ్దాలు మాత్రమే రికార్డ్ అయ్యాయని తెలిపింది. సీఎం రాక సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ పాటలు ఎక్కడా వినిపించలేదని పేర్కొంది. ఆ పాటలను తర్వాత డిజిటల్‌గా జోడించారు.. కాబట్టి ఈ వీడియోలు నిజం కావు అని క్లారిటీ ఇచ్చింది. ప్రజలు ఇలాంటి దుష్ప్రచారాలకు లోనుకాకూడదని విజ్ఞప్తి చేసింది. తర్వాత, సీఎం భక్తులతో కలిసి “గణపతి బప్పా మోరియా” నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను పలకరించారు. కొంతసేపు విగ్రహాల నిమజ్జనం కూడా వీక్షించారు. తొలిసారిగా ఒక ముఖ్యమంత్రి స్వయంగా నిమజ్జన కార్యక్రమానికి హాజరైన సందర్భమిది.. అని ఫ్యాక్ట్‌ చెక్‌ ఒరిజినల్ వీడియో పోస్ట్ చేసింది. ట్వీట్ లింక్..

Next Story