అదంతా ఫేక్.... రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ

by Prasad Jukanti |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై వస్తున్న వందంతులపై తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది.

అదంతా ఫేక్.... రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ
X
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇటీవలి విదేశీ పర్యటన (CM Foreign Tour) పూర్తిగా అధికారికంగా, ముందుగా షెడ్యూల్ చేసిన ప్రోటోకాల్ ప్రకారమే జరిగాయని తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది. సీఎం ఫారిన్ టూర్ మిస్టరీగా సాగిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఫ్యాక్ట్ చెక్
(Telangana Fact Check)
టీమ్ ఖండించింది. ఈ మేరకు ఇవాళ ఎక్స్ వేదికగా అధికారిక వివరణ ఇచ్చింది. సీఎం పర్యటనకు సంబంధించి సోషల్ మీడియాలో కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేశారుని ఇది కేవలం ప్రజలను తప్పుదారి పట్టించడానికి చేసిన ప్రయత్నమేనని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి ప్రయాణానికి సంబంధించిన షెడ్యూల్, ఆయన పర్యటన ప్రణాళికను ఆయా ప్రదేశాలలో ముందుగానే షెడ్యూల్ చేసిన కార్యక్రమాలకు అనుగుణంగా అధికారికంగా సమన్వయం చేయడం జరిగిందని తెలిపింది.

షెడ్యూల్ మేరకే తరగతులు:

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తెలంగాణని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొన్నారని తెలిపింది. దావోస్ నుండి ఆయన తదుపరి ప్రయాణం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే అక్కడ అధికారికంగా హాజరు కావాల్సిన కార్యక్రమాలు ముగిసిన తరువాతే జరిగిందని పేర్కొంది. అనంతరం ముందుగా నిర్ణయించిన ప్రణాళికలో భాగంగా సీఎం అమెరికాకు ప్రయాణం అయ్యి అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్నత స్థాయి విద్యా సంస్థ నిర్దేశించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపింది. షెడ్యూల్ ప్రకారం తరగతులు జరిగాయని అలాగే అక్కడ కోర్సు పూర్తయిన తర్వాత ఆ ప్రోగ్రాంకి సంబంధించిన సర్టిఫికెట్‌ను కూడా యూనివర్సిటీ అధ్యాపకులు ముఖ్యమంత్రికి అందించారని పేర్కొంది. ప్రజలుకు వాస్తవాలు తెలియచేసి, అపోహలను తొలగించడం కోసం ఈ వివరణ జారీ చేస్తున్నట్లు పేర్కొంది.

Next Story