- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అవి డెడ్ బాడీలు కాదు.. కేటీఆర్ ట్వీట్ పై ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ
కార్డ్ బోర్డ్ బాక్సుల్లో సిగాచీ మృతుల డెడ్ బాడీలు తరలిస్తున్నారంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ పై తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. మృతదేహాలను గౌరవంగా అప్పగించలేదని కేటీఆర్ ఆరోపించారని, కానీ ఆ వాదనను

దిశ, వెబ్ డెస్క్: కార్డ్ బోర్డ్ బాక్సుల్లో సిగాచీ మృతుల డెడ్ బాడీలు తరలిస్తున్నారంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ పై తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. మృతదేహాలను గౌరవంగా అప్పగించలేదని కేటీఆర్ ఆరోపించారని, కానీ ఆ వాదనను సంగారెడ్డి జిల్లా పరిపాలన అధికారులు తోసిపుచ్చినట్టు పేర్కొంది. కేసీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన బాక్సులు ఫోరెన్సిక్ విభాగం సేకరించిన డీఎన్ఏ నమూనాలకు చెందినవని తెలిపారు. అందులో మృతదేహాలు లేవని స్పష్టం చేశారు. మృతదేహాలను ఫ్రీజర్‌లలో భద్రపరిచి అంబులెన్స్‌లలో రవాణా చేశారని చెప్పారు. పోలీస్ ఎస్కార్ట్‌తో కుటుంబాలకు అప్పగించారని, ఇతర రాష్ట్రాల్లోని వారికి చెందిన డెడ్ బాడీలను కూడా స్వస్థలాలకు చేర్చినట్టు తెలిపారు. అంతే కాకుండా బాధిత కుటుంబాల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని రూ.1 లక్ష సాయంగా అందజేసినట్టు పేర్కొన్నారు.






