సీతాగొందిలో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులపై గ్రామస్తుల దాడి

by Muthe.Rajitha |   (  Updated:2025-12-17 14:58:37  IST  )

తెలంగాణలో నేడు చివరి విడత గ్రామ పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

సీతాగొందిలో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులపై గ్రామస్తుల దాడి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో నేడు చివరి విడత గ్రామ పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆదిలాబాద్ జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడి, పోలీసులకు గ్రామస్తులకు ఘర్షణ జరిగింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగొందిలో కౌంటింగ్ జరుగుతున్న సమయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థికి, కాంగ్రెస్ రెబల్ కు ఒక్క ఓటు తేడా రావడంతో ఇరు వర్గాల కార్యకర్తలు పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జికి దిగగా.. గ్రామస్తులు ఎదురుతిరిగారు.

ఈ క్రమంలో గ్రామస్తులు పోలీసులపైకి రాళ్లు విసరడంతో ఎస్‌ఐకి, పలువురు కానిస్టేబుల్స్ కు గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు భారీగా అదనపు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉద్రిక్తతల అనంతరం కౌంటింగ్ కొనసాగుతోంది.

Next Story