- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐఏఎస్ వసుధా మిశ్రా పదవీ కాలం పొడిగింపు
వసుధా మిశ్రాను తిరిగి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా నియమిస్తూ క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఐఏఎస్ వసుధా మిశ్రా తిరిగి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా నియమిస్తూ క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన భారత ప్రభుత్వ కార్యదర్శి ర్యాంక్ మరియు వేతనంలో ఆమె నియామకానికి ఆమోద ముద్రవేసింది. ఈ నెల 28న వసుధా మిశ్రా పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత మరో ఏడాది కాలాని తిరిగి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా నియమిస్తూ క్యాబినెట్ నియామకాల కమిటీ కార్యదర్శి దీప్తి ఉమాశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది మార్చి 1 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 29 వరకు లేదా తదుపరి ఆర్డర్‌లు వచ్చే వరకు ఆమె ఈ పదవిలో కొనసాగుతారని పేర్కొన్నారు.
Next Story






