- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TGRTC: ముందు ఎక్స్ ప్రెస్.. వెనక పల్లెవెలుగు.. ఆర్టీసీ తీరుకు నోరెళ్లబెట్టాల్సిందే!
పల్లెవెలుగు బస్సులకు ఎక్స్ ప్రెస్ కలరింగ్ ఇవ్వడం దుమారం రేపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల కాలంలో తెలంగాణ ఆర్టీసీ (TG RTC) తీరు వివాదాస్పదం అవుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కారణంగా తమకు సీట్లు దొరకడం లేదని ఇప్పటికే పురుష ప్రయాణికులు గగ్గోలు పెడుతుంటే ఆర్టీసీ మాత్రం పల్లెవెలుగు బస్సులకు ఎక్స్ ప్రెస్ కలరింగ్ ఇవ్వడం దుమారం రేపుతోంది. బస్సు ముందు భాగంలో ఎక్స్ ప్రెస్ రంగు, బోర్డుతో వెనుక భాగం పల్లెవెలుగు రంగుతో ప్రయాణికులను నిలువుదోపిడికి పాల్పడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా పల్లె వెలుగు బస్సుకు (Pallevelugu Bus) రంగు మార్చి ఎక్స్‌ప్రెస్ (Express Bus) బోర్డుతో ఉన్న బాన్సువాడ డీపోకు చెందిన (TG 17Z 0071) బస్సు జేబీఎస్ లో దర్శనం ఇచ్చింది. ఈ బస్సు వెనక భాగంలో పల్లెవెలుగు అని స్పష్టంగా రాసి ఉండగా ముందు బోర్డు మాత్రం ఎక్స్ ప్రెస్ బోర్డు కనిపిస్తోంది. దీంతో ఆర్టీసీ తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రయాణికుల నిలువుదోపిడి అని మండిపడుతున్నారు. ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసి సీట్లు లేకుండా ప్రయాణిస్తున్న తమను ఇలా మోసం చేయడం ఏంటని మండిపడుతున్నారు.
ఏడాదికి పైగా ఇదే తంతు:
అయితే పల్లె వెలుగు బస్సులకు రంగు మార్చి ఎక్స్ ప్రెస్ కలరింగ్ ఇవ్వడం గత ఏడాది కాలంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ చోట్ల యధేచ్ఛగా సాగుతోంది. సిద్దిపేట, హన్మకొండ, నాగర్ కర్నూల్, ఖమ్మం జిల్లాల్లోనూ ఇదేరకంగా చేయడంపట్ల ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ దర్శనం ఇస్తున్నాయి. తాజాగా మరోసారి అదే రిపీట్ కావడం పట్ల ప్రయాణికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీసులు తింపేందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చిందని గతంలో చెప్పిన అధికారులు ఇప్పటికీ ఇదే రకంగా దోపిడికి పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు.






