- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BC రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక
by Gantepaka Srikanth |
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో కులగణనపై నిపుణుల కమిటీ సమావేశమైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో కులగణనపై నిపుణుల కమిటీ సమావేశమైంది. బీసీ రిజర్వేషన్లపై సిద్ధం చేసిన నివేదికను నిపుణుల కమిటీ సీఎంకు అందజేసింది. నివేదికలో ఆర్థిక, విద్య స్థితిగతులపై కీలకంగా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో ఈ కమిటీ నివేదిక సిద్ధం చేసింది.
కాగా, రాహుల్ గాంధీ సూచనలతో తెలంగాణలో కులగణన చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ దేశ ప్రజల గుండెచప్పుడు విన్నారని, అందుకే కులగణన చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి అభినందనలు తెలియజేశారు. మా ఒత్తిడికి తలొగ్గి ప్రధాని మోడీ కులగణనపై నిర్ణయం తీసుకున్నారనీ వివరించారు.
Next Story






