- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bharat Summit: భారత్ సమ్మిట్ లో సామాజిక న్యాయం ఎగ్జిబిషన్ స్టాల్ ప్రారంభం
by Prasad Jukanti |
భారత్ సమ్మిట్ లో సామాజిక న్యాయం ఎగ్జిబిషన్ స్టాల్ ప్రారంభం

X
దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ హెచ్ఐసీసీ నొవాటెల్ లో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో భారత్ సమ్మిట్ (Bharat Summit) రెండో రోజు కొనసాగుతున్నది. పెట్టుబడులు, న్యాయం, అహింస, ప్రపంచ శాంతి లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజర్యయ్యారు. ఈ సందర్భంగా ఇవాళ భారత్ సమ్మిట్ లో ఏర్పాటు చేసిన సామాజిక న్యాయ ఎగ్జిబిషన్ ను (Social Justice Exhibition Stall) టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రతినిధులు విశ్వనాథన్, మంత్రులు సీతక్క కొండా సురేఖ, ఎంపీలు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, కడియం కావ్య, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. కాగా భారత్ సమ్మిట్ లో ఇవాళ లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు.
Next Story






