వాడో లఫూట్ గాడు.. బీఆర్ఎస్ మాజీ నేత జూపల్లి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 7 |
వాడో లఫూట్ గాడు.. బీఆర్ఎస్ మాజీ నేత జూపల్లి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్ : జూన్‌లో తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇవ్వనున్నట్లు జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. నా దారి ప్రజల దారి.. ఈసారి బీఆర్ఎస్‌ పార్టీది గోదారే అని జూపల్లి జోస్యం చెప్పారు. నాపై సెన్స్ లేనోళ్లు ఏదిబడితే అది మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. గత ఎన్నికల్లో నేను గెలిస్తే వారికి మంత్రి పదవి రాదని సొంత పార్టీ వాళ్లే నా ఓటమిలో భాగమయ్యారన్నారని ఆరోపించారు.

బీఆర్ఎస్ పార్టీలో నాకు సభ్యత్వమే లేదు మరి నన్ను ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. జూపల్లి ఆఫర్ల కోసం రాజకీయాలు చేసే వ్యక్తి కాదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ గద్దె దించేందుకు ఈటలను కలిసి రావాలని అడిగింది నిజమేనని ధృవీకరించిన జూపల్లి.. ‘దిశ టీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన పూర్తి వీడియో కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి.

Also Read: 1200 మంది ప్రాణత్యాగాల ముందు.. నీ కుటుంబ త్యాగమెంత? కేసీఆర్‌పై బీజేపీ ఫైర్


Next Story

Most Viewed