- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ సమావేశానికి ఎలా వస్తాడు? గాంధీ భవన్ వద్ద ఆగ్రహంతో ఊగిపోయిన జీవన్ రెడ్డి
గాంధీ భవన్‌లో జరుగుతున్న నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల సన్నాక సమావేశం నుండి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి బయటకు వెళ్ళిపోయారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: గాంధీ భవన్‌లో జరుగుతున్న నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల సన్నాక సమావేశం నుండి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి బయటకు వెళ్ళిపోయారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎమెల్యే డాక్టర్ సంజయ్ మీటింగ్ కి హాజరు కావడంపై జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన వల్ల వందశాతం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కానీ బీఆర్ఎస్ తో కొట్లాడిన తమ లాంటివాళ్లకి అవమానం జరుగుతోందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేను తమ పక్కన కూర్చోబెడుతున్నారని అలా కూర్చోబెడితే ఏం గౌరవం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరలేదని అన్నారు.
అభివృద్ధి కోసం వచ్చానని చెప్పాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్ సమావేశానికి ఎలా పిలిచారని ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశం అని ఆయన ఎలా వస్తారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేను పక్కన కూర్చోబెట్టుకుని మున్సిపల్ ఎన్నికలపై ఎలా చర్చిస్తారని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితి చూడాల్సి వస్తుందని ఊహించలేదన్నారు. గతంలోనూ ఇలాంటి పరిస్థితి వస్తే భరించానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తనేనని పార్టీ నుండి తాను వెళ్లిపోయే ప్రసక్తే లేదన్నారు. ఈ రోజు సమావేశం భారత రాజ్యాంగాన్ని అగౌరవపరిచేలా చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ తనకు గౌరవం ఇచ్చిందన్నారు.
కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తగ్గించే విధంగా చేపట్టిన కార్యక్రమాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని అన్నారు. సంజయ్ ఏ పార్టీ అనే అంశం స్పీకర్ ముందు ఉందని అలాంటి వ్యక్తిని తీసుకువచ్చి పక్కన కూర్చోబెట్టారన్నారు. ఇది కేవలం తన ఒక్కడి ఆవేదన కాదని లక్షలాది మంది తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన అని చెప్పారు. బీఆర్ఎస్ ఆకృత్యాలకు పదేళ్లపాటు కార్యకర్తలు గురయ్యారని అన్నారు. ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేను తీసుకువచ్చి పక్కన కూర్చోబెట్టారన్నారు. అధికారం ముఖ్యం కాదని రాజ్యాంగం విలువలు కాపాడటం ముఖ్యం అని అన్నారు.






