BREAKING: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-05-30 08:01:56  IST  )

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ అరెస్ట్ అయ్యారు. తెలంగాణ భ‌వ‌న్ వ‌ద్ద సుమ‌న్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద‌యం నుండి హైడ్రామా త‌ర‌వాత ఎట్ట‌కేల‌కు పోలీసులు సుమ‌న్ ను అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్త వాతావ‌ర‌ణంలో ఆయ‌నను అదుపులోకి తీసుకున్న పోలీసులు నాంప‌ల్లికి త‌ర‌లిస్తున్నారు.

BREAKING: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్
X

దిశ‌, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ అరెస్ట్ అయ్యారు. తెలంగాణ భ‌వ‌న్ వ‌ద్ద సుమ‌న్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద‌యం నుండి హైడ్రామా త‌ర‌వాత ఎట్ట‌కేల‌కు పోలీసులు సుమ‌న్ ను అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్త వాతావ‌ర‌ణంలో ఆయ‌నను అదుపులోకి తీసుకున్న పోలీసులు నాంప‌ల్లికి త‌ర‌లిస్తున్నారు. ఇటీవల సింగరేణిపై ఇటీవల చేసిన వివాదాస్పదాస్పద వ్యాఖ్యల కారణంగా పోలసులు సుమన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇక సుమ‌న్ అరెస్టుకు ముందు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి ప్ర‌శ్నిస్తే అక్ర‌మ కేసులుపెట్టి జైలుకు పంపిస్తోంద‌ని అన్నారు. తెలంగాణ ఉద్య‌మంలోనూ అప్ప‌టి కాంగ్రెస్ ప్ర‌భుత్వం తనపై 226 కేసులు పెట్టింద‌న్నారు. సుమారు నాలుగు సంద‌ర్భాల్లో త‌న‌పై లాఠీ ఛార్జ్ జ‌రిగింద‌ని చెప్పారు. ఉద్య‌మం స‌మ‌యంలో చ‌ర్ల‌ప‌ర్లి, చంచ‌ల్ గూడ జైళ్ల‌కు త‌ర‌లించార‌న్నారు.

మ‌ళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చి త‌న‌ను వేధిస్తోంద‌న్నారు. మొన్న క్యాత‌న‌ప‌ల్లి మున్సిపాలిటీని అక్ర‌మంగా ద‌క్కించుకునేందుకు త‌న‌ను జైలుకు పంపించార‌ని చెప్పారు. జైలులో త‌న‌కు అనేక ఇబ్బందులు ఎదుర‌య్యాయ‌ని, క‌నీస వ‌స‌తులు క‌ల్పించ‌కుండా ఇబ్బందిపెట్టార‌ని చెప్పారు. 2014 ఎంపీగా, 2019లో ఎమ్మెల్యేగా గెలిచానని ఓడినా ప్ర‌జ‌ల్లో ఉంటూ ప్ర‌శ్నిస్తున్నాన‌ని అన్నారు. ప్ర‌శ్నిన్నాన‌నే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ క‌లిసి కుట్ర పూరితంగా త‌న‌ను జైలుకు పంపిస్తున్నార‌ని చెప్పారు. సింగ‌రేణిలో వార‌సత్వ ఉద్యోగాల గురించి తాను ప్ర‌శ్నించాన‌ని తెలిపారు. సింగ‌రేణిలో జ‌రిగిన కుంభకోణాల గురించి నిల‌దీశాన‌ని తెలిపారు.

Next Story