- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ex-Minister: ఆ విషయం కోదండరాంకు కూడా తెలుసు.. మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్
అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాలు సజావుగా జరగకుండా చేయాలని పాలకపక్షం కుట్ర పన్నిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాలు సజావుగా జరగకుండా చేయాలని పాలకపక్షం కుట్ర పన్నిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) అన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్(Telangana Bhavan)లో మీడియాతో మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్షం సభకు రాకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర చేసిందని విమర్శించారు. అసెంబ్లీ బయటే తమను అడ్డగించడం దారుణం.. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరుగలేదని అన్నారు. తాము అదానీ-రేవంత్ ఉన్న టీ-షర్ట్ వేసుకెళ్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు ఏ బట్టలు వేసుకోవాలో కూడా స్పీకర్ చెబుతారా? అని మండిపడ్డారు. పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ(Rahul Gandhi) రోజూ అదానీ దుర్మార్గాల మీదే మాట్లాడుతున్నారు.. ఇక్కడేమో రేవంత్ రోజూ అదానీని వెనకేసుకొస్తున్నారని విమర్శించారు.
తెలంగాణను అదానీకి దోచిపెట్టే పనిలో రేవంత్ ఉన్నాడని కీలక ఆరోపణలు చేశారు. యాదాద్రి జిల్లా రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీ, లగచర్లలో పరిశ్రమలు అదానీ కోసమే అని అన్నారు. రాహుల్ కూడా అదానీ టీ-షర్ట్ ధరించి పార్లమెంట్ లోనికి వెళ్లారు.. మరి ఇక్కడ తమను ఎందుకు అడ్డుకుంటున్నారని అన్నారు. రాహుల్ గాంధీనే తాము కూడా అనుసరించామని తెలిపారు. ఉభయ సభలు రేవంత్ నడువుతున్నాడా? లేక శాసనసభ, శాసనమండలి స్పీకర్లు నడుపుతున్నారా? అని అడిగారు. డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన ఎలా వచ్చిందో అందరికీ తెలుసని అన్నారు. దీక్షలో ఉన్న కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో కేంద్రం నుంచి తెలంగాణ ప్రకటన వచ్చిందని గుర్తుచేశారు. ఆ విషయం ఎమ్మెల్సీ కోదండరాంకు కూడా తెలుసని అన్నారు. గతంలో ఉద్యమ కారులపై రేవంత్ రెడ్డి తుపాకీ ఎక్కుపెట్టారని గుర్తుచేశారు. ఎవరు ఎమన్నా తెలంగాణ ప్రకటన కేసీఆర్ విజయ, తెలంగాణ ప్రజల విజయం అని అన్నారు.






